IPL 2023 Playoffs Race: ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆ మూడు జట్లు ఏవి..?

Indian Premier League Playoffs Scenario: 3 బెర్తులు.. 7 టీమ్‌లు.. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఏడు జట్లు చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి..? ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? ఇంకా ఎన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి..?  

Written by - Ashok Krindinti | Last Updated : May 19, 2023, 01:40 PM IST
IPL 2023 Playoffs Race: ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆ మూడు జట్లు ఏవి..?

Indian Premier League Playoffs Scenario: ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ బెర్త్‌లపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే టోర్నీలో అన్ని జట్లు 13 మ్యాచ్‌లు ఆడేశాయి. గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. ఢిల్లీ క్యాపిటిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తప్పుకున్నాయి. అన్ని జట్లకు గ్రూప్ దశలో ఒకే మ్యాచ్‌ మిగిలి ఉంది. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకువచ్చింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మరింత పెరిగాయి. ఈ గెలుపుతో 13 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో టాప్-4లో నిలిచింది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. మే 21న గుజరాత్ టైటాన్స్‌తో ఆర్‌సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడంతో మూడు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో పాటు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు రేసులో ఉన్నాయి. చెన్నై, లక్నో ప్రస్తుతం చెరో 15 పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఎవరైనా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోతే.. ముంబై, ఆర్‌సీబీ జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఒక బెర్త్‌ కోసం పోటీ ఉంటుంది. ముంబై, ఆర్‌సీబీ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళుతుంది.

ముంబై తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోతే.. 14 పాయింట్లతో టోర్నీ నుంచి తప్పుకుంటుంది. ఆర్‌సీబీ కంటే తక్కువ రన్‌రేట్ ఉండడం ఆ జట్టుకు మైనస్. ఇక కేకేఆర్, పంజాబ్, రాజస్థాన్ జట్లు 12 పాయింట్లతో ఉన్నాయి. కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌లలో విజయం సాధించినా.. ముంబై, ఆర్‌సీబీల ఓటమి కోసం ఎదురుచూడాలి. అప్పుడు నెట్‌ రన్‌రేట్ ఎక్కువగా ఉన్న జట్టు ముందుకు వెళుతుంది. పంజాబ్, రాజస్థాన్ జట్లలో నేడు మ్యాచ్‌ జరుగుతుండడంతో గెలిచిన జట్టుకు మాత్రమే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్, ఢిల్లీ జట్లు చివరి రెండుస్థానాల కోసం పోటీ పడుతున్నాయి. తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి.

Also Read: PBKS Vs RR Dream11 Prediction: ఓడిన జట్టు ఇంటికే.. రాజస్థాన్‌తో పంజాబ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇలా ఎంచుకోండి  

Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News