IND Vs Aus WTC Final 2023: దాదాపు రెండు నెలలు క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగిసిపోవడంతో.. అభిమానులకు అలరించేందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రెడీ అవుతోంది. జూన్ 7వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. లండన్ నగరంలోని కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానంలో రెండు జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ ముమ్మురం చేశారు. ఐపీఎల్ పొట్టి ఫార్మాట్‌లో ఆడిన ఆటగాళ్లు.. వెంటనే టెస్ట్ మ్యాచ్‌కు అలవాటు పడాల్సి ఉంటుంది. గత టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో బరిలోకి దిగుతోంది.
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులను కలవరపరుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వర్షకాలం ఉంది. వర్షాలతోపాటు చలి కూడా వీపరితంగా ఉంటోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా లేదా మ్యాచ్ ఫలితం రాకపోయినా ఎవరు ఛాంపియన్‌గా నిలుస్తారనే ప్రశ్న అభిమానుల్లో మెదులుతోంది. టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ జరిగే జూన్ 7 నుంచి జూన్ 11 వరకు ఏదైనా రోజు వర్షం కారణంగా ఆటంకాలు ఎదురైతే.. రిజర్వ్ డే కూడా కేటాయించారు. జూన్ 12న కూడా ఒక రోజు ఎక్కువగా మ్యాచ్ నిర్వహిస్తారు.
ఒక వేళ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున అంటే జూన్ 12న కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రాకపోతే.. భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడితే.. రిజర్వ్ డేను వాడుకుంటారు. అప్పుడు కూడా ఆట సాధ్యం కాకపోతే రెండు జట్లు విజేతలుగా నిలుస్తాయి.
కాగా.. ఇటీవల ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను కూడా రిజర్వ్ డే రోజున నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక వేళ ఆ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరగపోయి ఉంటే.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గుజరాత్ విజేతగా నిలిచేది. అయితే వరుణుడు శాంతించడంతో మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, మార్నస్ లాబూషేన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి