Tata Nexon Emi Calculator: టాటా నెక్సాన్‌ డౌన్ పేమెంట్, EMI వివరాలు ఇవే, ఇలా తక్కువ వడ్డీతో పొందొచ్చు!

Tata Nexon EMI Calculator: టాటా నెక్సాన్‌ను డౌన్ పేమెంట్ కట్టి కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఇది అనుసరిస్తే.. కేవలం 9 శాతం వడ్డీతో మీరు కారు పొందవచ్చు. టాటా నెక్సన్ డౌన్ పేమెంట్ , EMIకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే!

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 12, 2023, 10:04 AM IST
Tata Nexon Emi Calculator: టాటా నెక్సాన్‌ డౌన్ పేమెంట్,  EMI వివరాలు ఇవే, ఇలా తక్కువ వడ్డీతో పొందొచ్చు!

Tata Nexon EMI Calculator: టాటా నెక్సాన్ భారత మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్న SUVల్లో ఎక్కువగా విక్రియంచిన కార్లలో ఇది ఒకటి. ఈ కారును వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి దీని మైలేజే కారణమని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కారు విక్రయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2023 మార్చిలో 14 వేల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మీరు కూడా ఈ టాటా నెక్సాన్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా డౌన్ పేమెంట్ కట్టి EMIని రూపంలో కూడా డబ్బులు చెల్లించవచ్చు. టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌ను రూ. 2.5 లక్షల డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయడానికి మీరు ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా నెక్సన్ ఫీచర్ల వివరాలు:
టాటా నెక్సాన్ ఫీచర్ల విషయానికొస్తే..ఇందులో 1.2L 3 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ (110 PS/170 Nm)తో పాటు 1.5L 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ (110 PS/260 Nm) ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

టాటా నెక్సన్‌లో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ సఫోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రెయిన్-సెన్సింగ్ వైపర్లు, AC వెంట్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, EBD, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్ వంటి చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే

Tata Nexon కోసం డౌన్ పేమెంట్ , EMI వివరాలు: 
టాటా Nexon కోసం డౌన్ పేమెంట్ కట్టి కొనుగోలు చేయాలనుకునేవారు..EMIకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. బేస్ వేరియంట్ రూ. 7.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ఆన్-రోడ్ ధర రూ.8.75 లక్షలతో అందుబాటులో ఉంది. దీనిపై లోన్ అప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ కారును రూ. 2.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేయోచ్చు. దీంతో మీరు మొత్తం రూ.6.25 లక్షలు లోన్‌ పొందుతారు. 

మీరు ఈ పొందిన రూ.6.25 లక్షలు రుణాన్ని 5 సంవత్సరాల పాటు EMI కిందికి మార్చుకుంటే 9 శాతం వడ్డిపడుతుంది. ప్రతి నెలా దాదాపు రూ. 12,990 EMI చెల్లించాలి. దీంతో మీరు మొత్తం రూ.1.53 లక్షల పాటు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా EMIలో కూడా చాలా రకాల ఆప్షన్స్‌ అభిస్తున్నాయి. 

Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News