Girl's Body Sent For Postmortem, Declared Alive: కొన్నిసార్లు, కొన్ని వార్తలు మనల్ని విస్తుపోయేలా చేస్తాయి.. ఇంకొన్ని వార్తలు మన కళ్లని, మన చెవుల్ని మనమే నమ్మకుండా చేస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు మనం తెలుసుకోబోయే వార్త కూడా అలాంటిదే. చనిపోయింది అని అనుకున్న ఓ బాలికను పోలీసులు పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లగా.. డాక్టర్లు ఆమెకు ప్రాణం పోసి తిరిగి ఇంటికి పంపించారు. ఇదేదో బాగుందే అని అనుకుంటున్నారు కదా.. ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
మీర్జాపూర్‌లో ఓ బాలిక కాలువలో పడి నీట మునిగింది. నీళ్లు మింగిన ఆ బాలిక చనిపోయింది అనే అందరూ భావించారు. పోలీసులు కూడా ఆమె చనిపోయింది అనే అనుకున్నారు. కానీ ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురుని పోస్ట్ మార్టం కోసం కాకుండా చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా పట్టుపట్టారు. పోలీసులు మాత్రం పోస్టుమార్టం కోసమే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పోస్టుమార్టం కోసం ప్రక్రియ మొదలైంది. వైద్యులు శవపరీక్ష మొదలుపెట్టారు. ఈ ప్రక్రియను దగ్గరుండి నిర్వహిస్తున్న వైద్యుడు ఆ చిన్నారి హార్ట్ బీట్ చెక్ చేశాడు. ఆ చిన్నారి గుండె కొట్టుకుంటూ ఉండటం గమనించాడు. వెంటనే కనురెప్పలు తెరిచిచూస్తే కళ్లలోనూ కదలిక కనిపించింది. ఆ బాలిక చనిపోలేదు.. ఇంకా ప్రాణంతోనే ఉంది. కాకపోతే అపస్మారక స్థితిలో ఉంది అని నిర్ధారించుకున్న వైద్యుడు.. వెంటనే ఆ బాలికకు అత్యవసర వైద్యం అందించే పని మొదలుపెట్టాడు.
పొట్టను ఒత్తి మింగిన నీళ్లను వెలికి తీసి తదుపరి చికిత్స కొనసాగించాడు. కొద్దిసేపటికే పూర్తి స్పృహలోకి వచ్చిన బాలిక మానసిక పరిస్థితిని కూడా వైద్యులు పరీక్షించారు. తన పేరు, తన తండ్రి పేరు, తన ఊరి పేరు.. ఇలా డాక్టర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని వైద్యుల ముందు నిరూపించుకుంది. మీర్జాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులనే కాదు.. ఈ ఘటన గురించి తెలిసిన వాళ్లందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఇది కూడా చదవండి : Angry King Cobras Video: లవ్‌లో ఉన్న 2 నాగు పాములను బయటికి తీశాడు.. వాటి కోపాన్ని చూస్తే షాకవుతారు
అందరూ చనిపోయింది అని అనుకున్న తమ బిడ్డ ప్రాణాలతో తిరిగిరావడం ఆ తల్లిదండ్రులను ఎనలేని ఆనందానికి గురిచేసింది. తమ బిడ్డ చనిపోలేదని.. ఆమె ప్రాణాలతోనే ఉందని.. వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలి అని ఎంత చెప్పినా పోలీసులు తమ మాట వినిపించుకోలేదని.. కానీ చివరకు తమ మాటే నిజమైంది అని ఆ బాలిక తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. పోలీసులు చేసిన పొరపాటుకు స్థానికులు సైతం నోరెళ్లబెట్టారు. బాలిక చనిపోక ముందే చనిపోయింది అని ఎలా నిర్ధారించుకున్నరో అర్థం కావడం లేదు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి చనిపోయింది అనుకున్న చిన్నారి పోస్టుమార్టం గది నుంచి ప్రాణాలతో తిరిగి రావడం ఆ గ్రామస్తులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ వార్తా కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి : Highest Paid Salary Jobs: మన దేశంలో ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్ ఏంటో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK