Dangerous King Cobra: ముసలోడే కానీ.. మహానుభావుడు.. 16 అడుగుల కింగ్ కోబ్రాను సింపుల్ గా పట్టేశాడు!

Black King Cobra: ఇప్పటి వరకు మీ జీవిత కాలంలో మీరు ఎన్నో పాములను చూసి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎన్నో స్నేక్స్ వీడియోలు చూసి ఉండొచ్చు .. కానీ ఇలాంటి  ఇంత భయంకరమైన స్నేక్ వీడియో మాత్రం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇదొక డేంజరస్ బ్లాక్ కింగ్ కోబ్రా స్నేక్ వీడియో.. ఎందుకిలా చెబుతున్నామో వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2023, 07:22 PM IST
Dangerous King Cobra: ముసలోడే కానీ.. మహానుభావుడు.. 16 అడుగుల కింగ్ కోబ్రాను సింపుల్ గా పట్టేశాడు!

Giant King Cobra Viral Video: ఇప్పటి వరకు మీ జీవిత కాలంలో మీరు ఎన్నో పాములను చూసి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎన్నో స్నేక్స్ వీడియోలు చూసి ఉండొచ్చు .. కానీ ఇలాంటి  ఇంత భయంకరమైన స్నేక్ వీడియో మాత్రం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. చూడ్డానికే ఎంతో వైల్డ్‌గా కనిపిస్తున్న ఈ స్నేక్‌ని చూడటానికే గుండె ధైర్యం సరిపోదు అని అనుకుంటే.. అంత భయంకరమైన పాముని వాళ్లు పట్టిన విధానం మరింత గూస్‌బంప్స్ తెప్పించేదిగా ఉంది.

యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ స్నేక్ వీడియోను చూస్తే.. ముందుగా ఇద్దరు స్నేక్ క్యాచర్స్ పాములను పట్టేందుకు అడవిలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ ఇద్దరూ ఒక చోట ఆగిపోయారు. అక్కడ తమ కళ్ల ఎదురుగా కనిపిస్తున్న పొదల్లో వారికి పాము దాగి ఉంది అనే అనుమానం వచ్చింది. అంత కచ్చితంగా అక్కడ పాము ఉన్నట్టుగా వారికి అనుమానం ఎలా వచ్చిందో, ఎందుకు అనిపించిందో తెలియదు కానీ.. ఆ పొదల్లోని గడ్డిపోచలను పక్కకు జరిపి చూస్తే నిజంగానే అక్కడ వారికి పాము కనిపించింది. 

చూడ్డానికి అస్పష్టంగానే ఉన్నప్పటికీ .. ఆ పాము భారీ సైజులో ఉన్నట్టుగా ఆ పాము లావుగా ఉండటం చూస్తే అర్థం అవుతుంది. పైగా నల్లగా ఉన్న ఆ పాముపై భయంకరంగా ఏవో మచ్చలు కూడా ఉన్నాయి. అంత పెద్ద పాముని ఆ పొదల్లో ఉండగానే సరిగ్గా పాము తల పట్టుకుని బయటికి లాగాడు. ఆ పాము కాటేస్తే మనిషి అనే వాడు బతకడం కూడా కష్టమే. అయినా సరే అతడు గుడ్డిగా అంత ధైర్యం ఎలా చేశాడో అర్థం కావడం లేదు. ఆ పొదల్లో ఉన్న పాము ఏదో తిని మత్తుగా పడుకోవడం వల్లే అతి అతడు పట్టుకునేటప్పుడు తిరగబడలేకపోయింది అని ఆ పామును బయటికి తీశాకే అర్థమైంది. అయినప్పటికీ.. అప్పటికీ అతడి ఎడమ చేతిలో ఉన్న ఆ పాము తల భాగం ప్రతిఘటించడానికి... వీలైతే అతడికి నోరు తెరిచి కాటు వేయడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది. వీడియోలో ఆ దృశ్యాన్ని చూడొచ్చు.

ఇది కూడా చదవండి: King Cobra Venom: నాగు పాము కాటుకి అంత విషం ఉంటుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News