Hand Mudras To Get Rid Of Overthinking In 2 Days: అతిగా ఆలోచించడాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. అతిగా ఆలోచించడం కారణంగా తీవ్ర మానసిక సమస్యలు వస్తాయి. దీని కారణంగా ప్రస్తుతం చాలా మందిలో అలసట, ఒత్తిడి గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీరు కూడా ఇలా అలోచిస్తే తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా యోగాసనాల వల్ల కూడా సులభంగా ఈ ఓవర్ థింకింగ్ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి అసనాలు వేయడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ ముద్రాసనాలు తప్పకుండా వేయాల్సి ఉంటుంది:
హాకిని ముద్ర:
హాకిని ముద్ర ను తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం ఎప్పుడైనా వేయోచ్చు. ఈ ముద్రను సాధన చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ముద్రను ప్రతి రోజు వేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఓవర్ థింకింగ్ నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను అనుసరించాల్సి ఉంటుంది.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
జ్ఞాన ముద్ర:
అతిగా ఆలోచించే సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జ్ఞాన ముద్ర తప్పకుండా యోగాలో భాగంగా వేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జ్ఞాన ముద్ర ఉదయం పూట చేయడం వల్ల మంచి ఓవర్ థింకింగ్ సమస్యను తగ్గించుకోవచ్చు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ జ్ఞాన ముద్ర వేయాల్సి ఉంటుంది.
వాయు ముద్ర:
ఒత్తిడిని తగ్గించేందుకు వాయు ముద్ర కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. హార్మోన్ల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. తరుచుగా ఒత్తిడి, అలసట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాయు ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ ముద్రను రోజూ ఉదయం 20 నిమిషాల పాటు చేయడం వల్ల అతిగా ఆలోచించే సమస్య కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook