King of Kotha Teaser: ‘'కింగ్ ఆఫ్ కోటా'’ టీజర్ వచ్చేసింది.. గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ కుమ్మేశాడు..

King of Kotha teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కింగ్ ఆఫ్ కోటా'. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2023, 09:12 AM IST
King of Kotha Teaser: ‘'కింగ్ ఆఫ్ కోటా'’ టీజర్ వచ్చేసింది.. గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ కుమ్మేశాడు..

Dulquer Salmaan's King of Kotha teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కింగ్ ఆఫ్ కోటా'. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళ టీజర్ ను దుల్కర్ తండ్రి, హీరో మమ్మూట్టి .. తెలుగు టీజర్ ను సుపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేసారు. ఈ మూవీని మలయాళంతోపాటు తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది. అభిలాష్ జోషీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఓనమ్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా నిమిస్ రవి పనిచేస్తున్నారు. 

టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో నడుస్తోందని తెలుస్తోంది. ప్రజలను విలన్ల నుంచి రక్షించే గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ నటిస్తున్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. రాజు గారి రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే డైలాగ్ తో టీజర్ మెుదలవుతుంది. మెుత్తం ఒకటిన్నర నిమిషాలు ఉన్న టీజర్.. గ్యాంగ్ స్టర్లు, యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తి రేపుతోంది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా ఉంది. 1980-90ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ ను ఒకే యూట్యూబ్ లింక్‍తో చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిని వేఫారర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News