Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్

TS Ministers Fires On Rahul Gandhi: ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ రిమోట్ గాంధీలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.     

Written by - Ashok Krindinti | Last Updated : Jul 3, 2023, 01:13 PM IST
Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్

TS Ministers Fires On Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పప్పు అంటే తాను బాధపడేవాడినని.. అయితే ఖమ్మం సభలో రాహుల్ మాట్లాడిన  తీరు చూస్తుంటే  పప్పు అనడంలో తప్పేమి లేదని అనిపిస్తోందన్నారు మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక్కడ  కాంగ్రెస్  సన్నాసులు రాసిచ్చిన  స్క్రిప్ట్  రాహుల్ చదివి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చామా..  మాట్లాడామా.. పోయామా అన్నట్లు రాహుల్  తీరు ఉందన్నారు.  రాహుల్‌కు అవగాహన లేదు.. పరిజ్ఞానం లేదన్నారు. ఏ పదవి లేకపోయినా రాహుల్‌యే అన్నీ కాంగ్రెస్‌లో నడిపిస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ గురించి అంతా తెలుసు అని..  కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెప్పకుండా ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తాం అని రాహుల్ చెబుతున్నారని అన్నారు. 

"మొన్ననే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. అక్కడ 4 వేల పెన్షన్ ఇస్తున్నారా..? అక్కడ  ఇస్తామని ఎందుకు  చెప్పలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి వృద్దులకు  పెన్షన్ ఇవ్వడం లేదు.
తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లా..? ఏదీ పడితే అది నమ్మడానికి  4 వేల పెన్షన్ కాంగ్రెస్  పాలిత  రాష్ట్రాల్లో ఇచ్చి రాహుల్ ఇక్కడ ఇస్తానని చెప్పాలి. అసలు పెన్షన్ గురించి రాహుల్‌కు తెలుసా..? అవినీతి గురించి రాహుల్ మాట్లాడటమా..? అవినీతికి కాంగ్రెస్ రారాజు. అవినీతి ఆరోపణలతోనే రాహుల్  ఓడిపోయారు. రాహుల్ గాంధీ కాదు రిమోట్ గాంధీలా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌లో మీది రాచరిక కుటుంబ  టీమ్  కాదా..? కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు  80 వేల కోట్లు కూడా  కాలేదు. లక్ష  రూపాయల  అవినీతి జరిగిందని రాహుల్  అంటారా..? తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం  చేసింది కాంగ్రెస్  పార్టీయే. తెలంగాణ ను  బలవంతంగా  ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్  పార్టీ కాదా..? వందలాది మంది తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి కాంగ్రెస్  పార్టీ కారణం కాదా..? మేము ఎవ్వరికీ బీ టీం కాదు . ఉప ఎన్నికల్లో కాంగ్రెస్  బీజేపీ  కలిసి పని చేశాయి.  కావాలంటే ఈటల.. రేవంత్ హోటల్లో కలుసుకున్న  ఫోటోలు  రాహుల్‌కు  పంపిస్తా.." అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  

మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మంలో రాహుల్ గాంధీ ప్రేలాపనలు చేశారని అన్నారు. భారత్ జోడో యాత్ తో రాహుల్‌లో పరిపక్వత పెరిగిందని  అనుకున్నానని.. కానీ అలాంటిదేమి లేదని రాహుల్ ఖమ్మంలో  నిరూపించారని అన్నారు. కాంగ్రెస్‌ను మించిన కుటుంబ  అవినీతి పార్టీ ఏదైనా ఉందా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం  చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. 2009లో తెలంగాణ ప్రకటన  చేసి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని అన్నారు. కాంగ్రెస్ కల్లి బొల్లి కబుర్లకు  తెలంగాణ  లొంగదన్నారు. పొంగులేటి సహా  ఎవరికీ  కేసీఆర్  అన్యాయం చేయలేదని.. ఈసారి  ఖమ్మంలో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు  గెలిచి  చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: Jonny Bairstow Controversial Run Out: ఊహించని రీతిలో బెయిర్‌ స్టో రనౌట్.. ఫస్ట్ టైమ్ ఇలా..  

Also Read: PM Narendra Modi: పీఎం మోదీ నివాసంపై డ్రోన్ కలకలం.. నో ఫ్లై జోన్‌లో ఎలా వచ్చింది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News