Asthma Patients Precautions In Monsoon: వర్షాకాలంలో వాతావరణం లోతిమ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి ఆస్తమాతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తేమ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడు మీతోనే ఇన్‌హేలర్‌ని ఉంచుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఆస్తమాతో బాధపడేవారు తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో ఇలాంటి ఆహారాలను తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఆస్తమా కారణంగా ఉబ్బసం పెరిగి తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఉబ్బసం అనేది శ్వాసనాళాల వాపుతో కూడిన వ్యాధి. ఆస్తమాతో బాధపడే రోగులలో గురక, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ బిగుతు, దగ్గు వంటివి సర్వసాధారణం. అయినప్పటికీ దాని లక్షణాలు కాలక్రమేణా మారుతూ ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వర్షాకాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
అలెర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లు:
వర్షాకాలంలో అనేక రకాల బ్యాక్టీరియా, దుమ్ము, వైరస్‌లు, శిలీంధ్రాలు, పురుగులు వృద్ధి చెందుతాయి. దీని కారణంగా అలెర్జీ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. వీటి ప్రభావం ఆస్తమా పై పడి తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.
తేమ:
వాతావరణంలో తేమ స్థాయి పెరిగేకొద్దీ వాతావరణ ప్రభావం శరీరం పై పడి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారిలో ఊపిరితిత్తుల సమస్యలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆస్తమాతో బాధపడుతున్న వారు వర్ష కాలంలో పలు రకాలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook