Jupiter Transit: భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి.. నవంబర్ వరకు ఈ రాశులకు అదృష్టం..

Guru Gochar 2023: ప్రస్తుతం దేవగురు బృహస్పతి భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. గురుడు నక్షత్ర రాశి మార్పు వల్ల 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2023, 10:20 AM IST
Jupiter Transit: భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి.. నవంబర్ వరకు ఈ రాశులకు అదృష్టం..

Jupiter Nakshatra Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి చెప్పబడింది. గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తాయి. దేవగురు బృహస్పతి గత నెల 21వ తేదీ మధ్యాహ్నం 1.19 గంటలకు భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో నవంబరు 27 వరకు ఉంటాడు. ఆ తర్వాత అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. గురుడు సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది.

సింహం
ఈ గురు నక్షత్ర సంచారం సింహ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు  కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
తులారాశి
తులారాశి వారికి బృహస్పతి సంచారం చాలా లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. సొంత కంపెనీ ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
భరణి నక్షత్రంలోకి బృహస్పతి ప్రవేశం ధనుస్సు రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈసమయంలో మీరు శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్‌కు సంబంధించిన వింటారు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు లాభాలను పెంచుకోవడంతోపాటు బిజినెస్ కూడా విస్తరిస్తారు.  

Also Read: Budh Surya Yuti 2023: జూలై 17న అరుదైన కలయిక.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

మేషం
మేష రాశి వారికి ఈ గురు రాశి మార్పు చాలా ప్రత్యేకం కానుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. 
మకరరాశి
బృహస్పతి సంచారం మకరరాశికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈసమయం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఉన్నతాధికారులను మెప్పిస్తారు.

Also Read: Sun transit 2023: జూలై 16న సూర్య సంచారం... నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook  

Trending News