/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Post office Schemes: ఎందుకంటే ఎవరైనా సరే రిస్క్ లేకుండా పెట్టుబడులపై మంచి లాభాలు ఆర్జించాలనుకుంటారు. ఇలా ఆలోచించేవారికి ఇది గుడ్‌న్యూస్. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పథకాలు పోస్ట్‌ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్. పోస్టాఫీసుకు చెందిన ఆ టాప్ 5 డిపాజిట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.

ఇప్పటికీ దేశంలో బ్యాంకులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరించి..ఎక్కువ శాఖల్ని కలిగి ఉన్నవి పోస్టాఫీసులే. ఈ మద్యకాలలో పోస్టాఫీసులకు ఆదరణ పెరుగుతోంది. పెట్టిన పెట్టుబడులపై మంచి ఆదాయం రావాలంటే పోస్ట్‌ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ మంచి మార్గంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే వీటిలో పెట్టుబడులకు భద్రతతో పాటు మంచి రాబడి కూడా ఉంటుంది. పోస్టాఫీసు ఫథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. 

మొదటిది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్. ఐదేళ్ల మెచ్యూరిటీ ఉంటుంది. కనీసం వేయి రూపాయలతో ప్రారంభించవచ్చు. వార్షిక వడ్డీ 6.8 శాతం ఉంటుంది. మెచ్యూరిటీ కాలం తరువాతే వడ్డీ లెక్కించి ఇస్తారు. ఎన్ఎస్‌సి స్కీమ్‌లో 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తరువాత 21 లక్షలు వస్తాయి.

ఇక రెండవది సుకన్య సమృద్ధి పథకం.  ఈ పథకంలో సంరక్షకుడు పదేళ్ల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్ల పేరిట ప్రారంభించవచ్చు. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయలు, గరిష్టంగా 1 లక్ష 50 వేల రూపాయలవరకూ జమ చేయవచ్చు. ఏడాదికి 7.6 శాతం వార్షిక వడ్డీరేటు చొప్పున అందిస్తారు. 

మూడవది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకు ఉద్దేశించినది. మెచ్యూరిటీ ఐదేళ్లుంటుంది. ఈ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ వస్తుంది. వేయి రూపాయల కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. గరిష్టంగా 15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి పది లక్షల రూపాయలు స్కీమ్‌లో పెట్టుబడిగా పెడితే..ఐదేళ్లలో 14 లక్షల రూపాయలు వస్తాయి. వడ్డీరూపంలో 4 లక్షల 28 వేల 964 రూపాయలు పొందవచ్చు.

నాలుగవది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇందులో ఎవరైనా ఖాతా తెరవవచ్చు. పీపీఎఫ్ కింద పెట్టుబడి పెట్టే నగదుపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం 5 వందల రూపాయలు, గరిష్టంగా 1 లక్ష 50 వేల రూపాయలు జమ చేయవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి 1.5 లక్షలు పెట్టుబడి పెడితే..15 ఏళ్ల తరువాత 40 లక్షల రూపాయలు అందుతాయి.

ఇక ఐదవది కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీమ్‌లో కనీసం వేయి రూపాయలు పెట్టుబడిగా పెట్టవచ్చు. 124 నెలల్లో అంటే పది సంవత్సరాల 4 నెలల్లో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఏడాదికి 7.7 శాతం వడ్డీ లెక్కిస్తారు. 50 వేల రూపాయలు డిపాజిట్ చేస్తే..మెచ్యూరిటీ కాలం తరువాత 73 వేల 126 రూపాయలు వస్తాయి. 

Also read: Multibagger Stocks News : ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ల పంట పండింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Post office Schemes updates to secure your future, know the top 5 evergreen post office saving schemes and its benefits
News Source: 
Home Title: 

Post office Schemes: పోస్టాఫీసుల్లో ఎవర్ గ్రీన్ డిపాజిట్ పథకాలివే, ప్రయోజనాలివీ

Post office Schemes: పోస్టాఫీసుల్లో ఎవర్ గ్రీన్ డిపాజిట్ పథకాలివే, ప్రయోజనాలివీ
Caption: 
Post office Schemes ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Post office Schemes: పోస్టాఫీసుల్లో ఎవర్ గ్రీన్ డిపాజిట్ పథకాలివే, ప్రయోజనాలివీ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, July 9, 2023 - 00:03
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
49
Is Breaking News: 
No
Word Count: 
344