IND vs WI 1st Test, Day 1 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆరంభం అదిరింది. భారత్ బౌలర్లకు ధాటికి విండీస్ విలవిల్లాడింది. అతిథ్య జట్టును 150 పరుగులకే అలౌట్ చేసినా టీమిండియా.. బ్యాటింగ్ లోనూ అదే జోరును కొనసాగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30), యశస్వి జైస్వాల్ (40) పరుగులతో ఆడుతున్నారు. ఇంకా భారత్ 70 పరుగులు వెనుకంజలో ఉంది. విండీస్ ఆటగాళ్లలో అరంగేట్ర ఫ్లేయర్ అథనేజ్ ఒక్కడే 47 పరుగులతో రాణించాడు. మిగతా వారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
తొలుత టాస్ గెలిచిన కరేబియన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మెుదట 10 ఓవర్లపాటు విండీస్ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (12)ను అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత అతిథ్య జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్ 20 రన్స్ మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో రోహిత్ చేతికి చిక్కాడు. అనంతరం రీఫర్ ను శార్థూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. లంచ్ బ్రేక్ కు ముందు బ్లాక్‌వుడ్(14) జడేజా బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగాడు.
రెండో సెషన్‌లోనైనా పోరాడుతుంది అనుకున్న విండీస్ చేతులెత్తేసింది. అయితే అథనేజ్, జేసన్ హోల్డర్ నిలకడగా ఆడి స్కోరు బోర్డును వంద పరుగులు దాటించారు. ఈ సమయంలో హోల్డర్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. టీ విరామ సమయానికి విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్‌లో కీమర్ రోచ్ (1)ను జడేజా, వారికన్ (0)ను అశ్విన్ ఔట్ చేయడంతో కరేబియన్ జట్టు కథ ముగిసింది. రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. జడేజా 3, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అశ్విన్ అరుదైన ఘనత
భారత సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు క్రికెట్లో తండ్రీకొడుకులిద్దరినీ ఔట్ చేసిన అయిదో బౌలర్‌గా నిలిచాడు. తాజా టెస్టులో త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను బౌల్డ్ చేయడంతో అతడికీ ఈ ఘనత దక్కింది. 2011లో దిల్లీలో అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆ మ్యాచ్‌లో త్యాగ్‌నారాయణ్ తండ్రి శివ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ 700 వికెట్ల క్లబ్ లో చేరాడు. బుధవారం అల్జారి జోసెఫ్‌ను ఔట్ చేసి అతనీ ఘనతను సొంత చేసుకున్నాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707) మాత్రమే ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook