Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిని ముంచెత్తిన వరదలు

Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గతంలో ఎన్నడూ లేనంత వరద ప్రవాహం ముంచుకొచ్చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని సైతం వరద చుట్టుముట్టేసింది. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2023, 02:12 PM IST
Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిని ముంచెత్తిన వరదలు

Delhi Floods Updates: దేశ రాజధాని ఢిల్లీలో వరద ఉగ్రరూపం దాలుస్తోంది. భారీ వర్షాల కారణంగా యమునా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని కూడా వరదలు ముంచెత్తాయి. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

యమునా నది వరదలో ఢిల్లీ నగరం చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్నించి వస్తున్న వరద నీటితో యమునా నటి ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. యుమునా నదికి ఇంత పెద్దఎత్తున వరద రావడం ఇదే తొలిసారి. గతంలో 1978లో యుమునా నదికి భారీగా వరదలొచ్చాయి. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. 19078లో యుమునా నదిలో అత్యధికంగా 207.49 మీటర్ల వరకూ వరద ప్రవహించింది ఈసారి ఏకంగా 208.46 మీటర్లు దాటేసింది. ఇవాళ సాయంత్రానికి యుమునా నదిలో నీటి మట్టం మరింత పెరిగి 210 మీటర్లకు చేరుకోవచ్చని అంచనా. అందుకే కేంద్ర జలసంఘం అత్యయిక పరిస్థితి ప్రకటించింది. 

యుమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రాజ్‌ఘాట్ నుంచి సెక్రటేరియట్ వెళ్లే రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. సెక్రటేరియట్ క్యాంపస్‌లోనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారుల ఇళ్లుండటంతో అన్నీ నీట మునిగాయి. కేజ్రీవాల్ ఇంటిని భారీగా వరద చుట్టుముట్టేసింది. యమునా నది ఉగ్రరూపంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ అసెంబ్లీ కూడా వరద నీటిలో మునిగింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్‌కు వరద నీరు చేరింది. కశ్మీరీ గేట్ ప్రాంతంలో, లాల్ ఖిలా ప్రాంతంలో వరద నీరు ప్రవహిస్తోంది. యమనా నది మహోగ్రరూపం కారణంగా స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

యుమునా నది వరద ప్రవాహం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేశారు. ఫలితంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలకు మంచి నీటి కొరత ఏర్పడనుంది. హర్యానాలోని హత్నికుడ్ బ్యారేజ్ నుంచి నీటిని వదలడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 

Also read; yamuna River: డేంజర్ లో ఢిల్లీ.. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసిన యమునా నది..!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News