Weight Loss Tips in Telugu: చాలా మంది టీతోనే రోజును మొదలుపెడతారు. బెడ్ మీదనే వేడి వేడి టీ తాగి.. నిద్ర లేస్తూ దినచర్యలు మొదలుపెడతారు. ఒక్క రోజు టీ తాగకపోయినా.. ఆ రోజంతా ఏదో వెలితిగా ఉన్నట్లు ఉంటుంది. తలనొప్పితోపాటు ఫ్రస్టేషన్ కూడా వస్తుంది. ఇక ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్న వారు టైమ్ టు టైమ్ టీ తాగపోతే పనిపై సరిగా ధ్యాస పెట్టలేరు. ఫ్రెండ్స్‌తో కాసేపు ముచ్చట్లు చెప్పుకోవాలన్నా టీ కొట్టులే అడ్డాలు. ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా.. పదా అలా ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందామని అంటుంటారు. ఇలా టీ ప్రతిఒక్కరి జీవితంలో భాగమై పోయింది. అయితే పాలు, చక్కెర టీ తాగితే బరువు పెరుగుతుందని అందరికీ తెలిసిందే. పదే పదే టీ తాగడం కూడా జీర్ణక్రియకు అంత మంచింది కాదు. టీ తాగినా బరువు పెరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..
==> ఎక్కువగా టీ తాగే అలవాటు ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. టీలో షుగర్ పరిమాణం ఎక్కువగా ఉండటం బరువు పెరుగుదలకు కారణమవుతుంది. చక్కెర శరీరంలోకి వెళ్లిన తరువాత కొవ్వుగా మారి స్థూలకాయాన్ని పెంచుతుంది. మీరు షుగర్ లెస్ టీ లేదా.. షుగర్ తక్కువ ఉన్న టీని తాగడం ఉత్తమం. కొద్ది రోజుల ఇలా తాగి చూసిన తరువాత మీ ఫిట్‌నెస్‌లో మార్పులు గమనించవచ్చు.
==> ఒక కప్పు టీలో దాదాపు 125 కేలరీలు ఉంటాయి. టీను తయారుచేసేందుకు ఎక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్‌ను వాడుతుంటారు. మీరు ఎక్కువ బరువు పెరగకూడదనుకుంటే.. టీలో స్కిమ్డ్ మిల్క్‌ను ఉపయోగించండి.
==> చాలా మందికి టీతోపాటు స్నాక్స్ తినడం అలవాటుగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం టీ తాగినప్పుడల్లా.. సాల్టీ స్నాక్స్ తినడం అంతమంచిది కాదు. నూనె, ఉప్పు ఆహారం మీ బరువును మరింత పెంచుతుంది.
==> ప్రతి రోజూ మీరు లెక్కలేనన్ని టీలు తాగితే.. మీరు కచ్చితంగా అనారోగ్యం పాలవుతారు. రోజుకు రెండుసార్లు టీ తాగితే సరిపోతుంది. ఫ్రెండ్స్ కలిశారని.. తలనొప్పిగా ఉందని.. బోర్ కొడుతుందని ఇలా ప్రతిసారి టీ తాగితే మీరే ప్రమాదంలో పడతారు.
==> చక్కెర, పాలు టీ కంటే గ్రీన్ టీని అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మొదట్లో గ్రీన్ తాగడం కొంచెం కష్టంగా ఉన్న.. రోజూ తాగితే అలవాటుగా మారుతుంది. గ్రీన్ టీని రోజులో రెండు సార్లు తాగితే శరీరంలోని కొవ్వు కూడా క్రమంగా కరిగిపోతుంది.
Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి