Mars transit 2023 in leo: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. సాధారణంగా కుజుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్లడానికి 45 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం మార్స్ సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 18 వరకు అక్కడే ఉంటాడు. అనంతరం సింహరాశిని వదలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో నీచ భంగ్ రాజయోగం, మత్స్య యోగం, విష్ణు యోగాలు ఏర్పడుతున్నాయి. అంగారకుడు సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
మార్స్ సంచారం ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈసమయంలో మీకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు వారసత్వంగా ఆస్తి లభిస్తుంది.
మీనరాశి
అంగారక సంచారం మీనరాశి వారికి మేలు చేస్తుంది. జాబ్ చేసవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఫారిన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి.
మిధునరాశి
అంగారకుడు కదలిక వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. దీని వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ సమయం ఉద్యోగ మరియు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
Also read: Grahana yogam: తులా రాశిలో ఏర్పడనున్న గ్రహణ యోగం, రెండ్రోజులు తస్మాత్ జాగ్రత్త
మేషరాశి
కుజుడు రాశి మార్పు మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. అంగారకుడి సంచారం వల్ల మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాకుండా ప్రత్యర్థులపై ఎప్పుడూ మీరు పైచేయి సాధిస్తారు.
సింహరాశి
కుజుడు రాశి మార్పు మీకు ప్రతి పనిలోనూ విజయాన్నిస్తుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook