High Blood Pressure: బీపీని నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరం, రోజూ ఈ 3 పండ్లు తింటే చాలు

High Blood Pressure: ఆధునిక పోటీ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది అధిక రక్తపోటు. నిర్లక్ష్యంగా ఉంటే ఈ సమస్య ప్రాణాంతకం కాగలదు  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 30, 2023, 05:59 PM IST
High Blood Pressure: బీపీని నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరం, రోజూ ఈ 3 పండ్లు తింటే చాలు

High Blood Pressure: ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి సమస్యలు రోజురోజుకూ అదికమౌతున్నాయి. ముఖ్యంగా రక్తపోటు సమస్యను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ప్రమాదకరం కావచ్చు కూడా. రక్తపోటు నుంచి కాపాడుకోవాలంటే ప్రధానంగా చేయాల్సింది డైట్ నియంత్రణ.

దేశంలో రక్తపోటు వ్యాధిగ్రస్థుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. కారణం ఇండియాలో మెజార్టీ ప్రజలు సాల్టీ పదార్ధాలు ఎక్కువగా తింటుంటారు. సాల్టీ పదార్ధాల్లో సోడియం పరిమాణం అధికంగా ఉంటుంది. ఇదే రక్తపోటుకు కారణమౌతుంది. ఆయిలీ ఫుడ్స్, ప్రోసెస్డ్ ఫుడ్స్ అధికంగా తినేవారి దమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దాంతో బ్లాకేజెస్ ఏర్పడతాయి. ఎప్పుడైతే బ్లాకెజెస్ ఉంటాయో రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడి గుండె వరకూ రక్తం చేరేందుకు ఒత్తిడి అధికమౌతుంది. దీనినే రక్తపోటుగా పిలుస్తారు. 

రక్తపోటే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. రక్తపోటు కారణంగా గుండె వ్యాధులు మొదలౌతాయి. ఇందులో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ఉన్నాయి. ఎప్పుడైనా స్ట్రెస్ లేదా టెన్షన్‌లో ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ వ్యక్తులకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తపోటును నియంత్రించేందుకు మూడు పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

యాపిల్ అత్యద్బుతమైంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఆపిల్ తప్పనిసరి అని చెప్పవచ్చు. యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అని మనం తరచూ వింటుంటాం అందుకే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ నుంచి ఉపశమనం కల్గిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా ఒక ఆపిల్ తింటే మంచి ఫలితాలు చూడవచ్చు.

ఇక రెండవది అరటి పండు. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇది ఎంత ప్రమాదకరమో రక్తపోటు వ్యాధిగ్రస్థులకు అంత మంచిది. అరటి పండంటే ఇష్టపడనివారుండరు. ఇందులో పొటాషియం పెద్దమొత్తంలో ఉండటం వల్ల హైపర్ టెన్షన్ సమస్యను తగ్గిస్తుంది. రోజుకు ఒక అరటి పండు తింటే చాలంటారు. 

బత్తాయి కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బత్తాయిలతో  ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగకుండా నియంత్రిస్తుంది. 

Also read: eight Loss Drink: ఈ నేచురల్ డ్రింక్‌తో కేవలం 9 రోజుల్లోనే మీ పొట్ట భాగంలో కొవ్వు కరిగి, బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News