Daridra Yoga and Khappar Yoga: ప్రస్తుతం భారతదేశంలో అధిక మాసం ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో అదనపు నెల కారణంగా శ్రావణమాసంలో మొత్తం 59 రోజులు ఉండగా ఆగస్టు 30న ముగుస్తాయి. అయితే ఇదే క్రమంలో కొన్ని గ్రహాలు స్థానం చలనం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ శ్రావణమాసంలో కొన్ని గ్రహాల సంచార కారణంగా శుభ యోగాలు ఏర్పడితే మరికొన్ని గ్రహాల సంచారం కారణంగా అశుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో కర్కాటక రాశిలోకి సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీంతో దరిద్ర యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర నష్టాల భారీన పడతారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దరిద్ర యోగం ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శుభ గ్రహం ఒక అశుభ గ్రహంతో కలసినప్పుడు దరిద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వారి జన్మరాశిలో దరిద్ర యోగం ఏర్పడితే జీవితంలో చాలా రకాల సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శ్రావణమాసంలో ఐదు మంగళవారాలు ఉన్నప్పుడు గురు-రాహువు, కుజుడు శుక్ర-శని దృష్టి ప్రభావంతో మరో చండాల యోగం ఏర్పడుతుంది. ఈ మీ జాతకంలో ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 30 రోజుల పాటు నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
మిథున రాశి:
దారిద్ర్య యోగం మిథున రాశి వారికి చాలా ప్రతికూలగా ఉండబోతోంది. దీని కారణంగా భవిష్యత్ జీవితం పై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు చాలా రకాల ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో అజాగ్రత్తలు పాటిస్తే భారీ నష్టాలకు గురవుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కూడా తీవ్ర విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కన్యారాశి:
దరిద్ర యోగం ఏర్పడటం వల్ల కన్యా రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. ఈ క్రమంలో మీ తల్లి ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పనులు చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి