Tiger 3 Movie: సల్మాన్ ఖాన్ 'టైగర్‌ 3' టీజర్‌ వచ్చేది అప్పుడే..!

Tiger 3 Movie: కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్‌ 3. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ నెట్టింట సందడి చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2023, 04:10 PM IST
Tiger 3 Movie: సల్మాన్ ఖాన్ 'టైగర్‌ 3' టీజర్‌ వచ్చేది అప్పుడే..!

Tiger 3 Teaser update: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ మూవీ టైగర్‌ 3 (Tiger 3). మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ కీలకపాత్ర చేస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను స్వాతంత్య్ర దినోత్సవం రోజు విడుదల చేస్తే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఆగస్టు 15న టీజర్ లాంఛ్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు యశ్‌ రాజ్‌ ఫిలిం ప్లాన్ చేస్తోందట. ఈ చిత్రాన్ని నవంబరు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 

'టైగర్ 3' షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీలో అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మరోసారి స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌ షేర్ చేసుకోబోతుంది సీనియర్ నటి రేవతి (Revathi). టైగర్‌ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు వస్తున్న టైగర్3 సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. 

Also Read: OMG 2 Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్‌ కుమార్ 'ఓ మై గాడ్-2' ట్రైల‌ర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News