How To Prevent Tooth Cavities: కావిటీస్ నొప్పి భరించలేకపోతున్నారా? ఇవి తప్పక పాటించండి చాలు!

How To Prevent Tooth Cavities: ప్రస్తుతం చాలా మంది కావిటీస్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పలు చిట్కాలు పాటించడం వల్ల సులభంగా రక్షణ పొందవచ్చు. అంతేకాకుండా దంతాలు కుళ్లిపోకుండా ఉంటాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 6, 2023, 05:09 PM IST
How To Prevent Tooth Cavities: కావిటీస్ నొప్పి భరించలేకపోతున్నారా? ఇవి తప్పక పాటించండి చాలు!

 

How To Prevent Tooth Cavities: ప్రస్తుతం కావిటీస్ సాధరణ సమస్యగా మారింది..చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఈ దంత సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారిలో దంతాలు మొత్తం కుళ్లిపోయి, నోటి నుంచి దుర్వాసన సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొందరిలో చిగుళ్ల నుంచి కూడా రక్తస్రావం అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మిగిలిన పళ్లపై కూడా ప్రభావం పడుతుంది. అయితే దంతాలను సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

దంతాల సంరక్షణ ఎలా?
దంతాల సమస్యలు ఉన్న ఈ ఆహారాలు తీసుకోండి:
✧ తక్కువ కొవ్వు పాలు
✧ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు
✧ గింజలు
✧ మాంసం
✧ చేపలు
✧ సిట్రస్ పండ్లు
✧ టమోటాలు
✧ మిరియాలు
✧ బంగాళదుంపలు

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

నోటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి:
చాలా మంది తీపి వస్తువులను తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేయడం మానుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా మీ పళ్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలా చక్కెర పదార్థాలు తిన్న తర్వాత బ్రష్‌తో దంతాలను క్లిన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి:
దంతాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిగిత దంతాలు కూడా కుళ్ళిపోకుండా ఉంటాయి. కాబట్టి తరచుగా పంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. 

దంతవైద్యులను తప్పకుండా కన్సల్ట్‌ అవ్వాలి:
తీవ్ర కావిటీస్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దంతవైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే పన్ను మొత్తం చెడి పోయి ఇతర దంతాలకు వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News