Asian Champions Trophy 2023: జపాన్ ను చిత్తుగా ఓడించి.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్..

India vs Japan: ఆసియా ఛాంపియన్స్ షిప్ 2023 హాకీ సెమీస్ లో భారత్ విజయం సాధించింది. జపాన్ ను 5-0 తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. తుదిపోరులో మలేసియాతో తలపడనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2023, 08:28 AM IST
Asian Champions Trophy 2023: జపాన్ ను చిత్తుగా ఓడించి.. ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్..

Asian Champions Trophy 2023 hockey: ఆసియా ఛాంపియన్స్ షిప్ 2023 హాకీలో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో(Asian Champions Trophy 2023 Semi-final) జపాన్ ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులో టీమిండియా మలేషియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ శనివారం జరగనుంది. 

చెన్నైలోని రాధాకృష్ణ స్టేడియంలో జరిగిన సెమీస్ లో గేమ్ ప్రారంభం నుంచి భారత్ దూకుడుగా ఆడింది. భారత్ కు తొలి పాయింట్ పెనాల్టీ రూపంలో లభించింది. 19వ నిమిషంలో ఆకాశ్ దీప్ గోల్ కొట్టడం ద్వారా భారత్ ముందంజ వేసింది. తర్వాత అదే జోరును కొనసాగించింది భారత్. 23వ నిమిషంలో రెండో పెనాల్టీ కార్నర్ ద్వారా జట్టు ఆధిక్యాన్ని పెంచాడు కెప్టెన్ హార్మన్(Harmanpreet Singh). వరుసగా గోల్స్ చేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశారు. భారత్ 5-0తో జపాన్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరింది. 

భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (19’), హర్మన్‌ప్రీత్ సింగ్ (23), మన్‌దీప్ సింగ్ (30’), సుమిత్ (39’), కార్తీ సెల్వం (51’) గోల్స్ చేశారు. సెమీ-ఫైనల్ ప్రారంభానికి ముందు తన 300వ అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా పిఆర్ శ్రీజేష్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) సత్కరించింది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ ఇప్పుడు శనివారం జరిగే ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో మలేషియాతో తలపడనుంది. సెమీస్ లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాను 6-2 తేడాతో ఓడించి మలేషియా ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు కాంస్యం కోసం జపాన్ కొరియాతో తలపడనుంది. టోర్నీలో పాకిస్థాన్ 6-1 తేడాతో చైనాను ఓడించి ఐదో స్థానంలో నిలిచింది. లీగ్ దశలో భారత్ నాలుగు మ్యాచ్లు గెలిచి, మరో మ్యాచ్ డ్రాగా ముగించి టాప్ ప్లేస్ లో నిలిచింది. 

Also Read: ICC World Cup 2023 Tickets: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లు ఈజీగా ఇలా బుక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News