Vegetables Ragi Idli Recipe: అల్పాహారాల్లో భారతీయులు ఎక్కువగా తీసుకుని వాటిల్లో ఇడ్లీ ఎప్పుడూ ముందుంటుంది. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో ఇడ్లీతోపాటు నాన్ వెజ్ కర్రీలను కూడా సర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆహార ప్రేమికులు అల్పాహారాల్లో నాన్ వెజ్ ఇడ్లీ రెసిపీని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ రెసిపీలు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఓ ఇడ్లీ రెసిపీ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
వెజిటేబుల్స్ రాగి ఇడ్లీ శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది ప్రతిరోజు ఈ ఇడ్లీని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే పెద్దవారికి కాకుండా పిల్లలకు అనేక రకాల ప్రయోజనాలను శరీరాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి పిండి లో ఉండే ఔషధ గుణాలు శరీరానికి శక్తినివ్వడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా వీటిని పిల్లలకు అల్పాహారంలో ఇవ్వడం వల్ల వారి శరీరం దృఢంగా శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్
ఈ ఇడ్లీని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
✽ రెండు కప్పుల రాగి పిండి
✽ ఒక కప్పు బొంబాయి రవ్వ
✽ ఒక కప్పు పుల్లని పెరుగు
✽ తగినంత ఉప్పు
✽ తరిగిన క్యారెట్ తురుము
✽ అర కప్పు క్యాప్సికం మొక్కలు
✽ టీ స్పూన్ నూనె
✽ ఒక కప్పు తరిగిన కొత్తిమీర
✽ రెండు రెమ్మల కరివేపాకు
వెజిటేబుల్స్ రాగి ఇడ్లీ తయారీ పద్ధతి:
ఇడ్లీలను తయారు చేసుకోవడానికి ముందు ఒక చిన్న బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి.. ఆ తర్వాత పుల్లని పెరుగును మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తగిన పరిమాణంలో ఉప్పు మిగితా పదార్థాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మరో అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ కుక్కర్ లోని ఇడ్లీ పాత్రలో ఈ పిండిని ఫిల్ చేసి ఇడ్లీలు తయారయ్యే వరకు సన్నని మంటపై ఇడ్లీ కుక్కర్ ని పెట్టాల్సి ఉంటుంది. ఇలా తయారయ్యాక కొబ్బరి చట్నీ తో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి