UPI Lite Transaction limit Increased: యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆఫ్‌లైన్‌లో యూపీఐ లైట్ ద్వారా చెల్లింపు పరిమితిని పెంచింది. గతంలో రూ.200 ఉండగా.. ప్రస్తుతం రూ.500కి పెంచింది. ఇంటర్‌నెట్ లేని.. తక్కువ ఉన్న ప్రాంతాల్లో యూపీఐ లైట్ ద్వారా ఆఫ్‌లైన్ పేమెంట్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతను ఉపయోగించాలనే లక్ష్యంతో తాజాగా మూడు అప్‌డేట్స్ చేశారు. అవి ఏంటంటే..?
==> ఏఐ పవర్డ్ సిస్టమ్‌లతో సంభాషణలతో పేమెంట్స్ చేయడానికి వినియోగదారులకు ‘Conversational Payments’కు పర్మిషన్ ఇస్తుంది.
==> 'UPI-Lite' ఆన్-డివైస్ వాలెట్ ద్వారా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీని ఉపయోగించి యూపీలోలో ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు.
==> ఆఫ్‌లైన్ మోడ్‌లో చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీ పరిమితిని రూ.200 నుంచి రూ.500కి పెంచారు. రోజులో రూ.2 వేల వరకు చెల్లింపు చేయవచ్చు.
ఇంటర్‌నెట్ లేకుండా పేమెంట్స్ ఇలా..
మీరు నెట్ కనెక్షన్ లేని సమయంలో కూడా పేమెంట్స్ జరపవచ్చు. ఇందుకోసం *99# సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 83 ప్రముఖ బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి. ఇంగ్లీష్, హిందీతోపాటు దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఈ సేవలను వినియోగంచుకోవచ్చు. ఈ సేవను ఒక్కసారి యాక్టివేట్ చేసుకుంటే.. ఎప్పటికీ లావాదేవీలు నిర్వహించవచ్చు. ముందుకు మీ యూపీఐ రిజస్టర్ మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్‌కు డయల్ చేయండి. ఆ తరువాత నచ్చిన భాష ఎంచుకోండి. మీ బ్యాంక్ పేరు ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు కనిపించిన తరువాత ఏ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ నిర్వహించాలని అనుకుంటున్నారో.. ఆ నంబరును ఎంచుకోండి. మీ డేబిట్ కార్డు వివరాలను ఎంటర్ చేయండి. తరువాత సక్సెస్‌ఫుల్‌గా సెట్టింగ్స్ కంప్లీట్ అవుతుంది.
పేమెంట్స్ పంపించేందుకు *99# నంబర్‌కు కాల్ చేయాలి. తర్వాత 1 ప్రెస్ చేయాలి. అనంతరం నగదు పంపించాలని అనుకుంటున్న వారి మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. తరువాత పంపించాల్సిన అమౌంట్‌ను ఎంటర్ చేసి.. మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయండి. తరువాత విజయవంతంగా టాన్సిక్షన్ కంప్లీట్ అవుతుంది. ఈ సేవ ద్వారా ఒకసారి రూ.5 వేల వరకు నగదు బదిలీ చేయవచ్చు.
Also Read: Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook