Heart Problems In Young Individuals: ఇటీవలి కాలంలో చాలామంది యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. డాన్స్ చేస్తూనో లేక వ్యాయమం చేస్తూనో ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోతున్న యువకుల ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించిన లైవ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అచెంచలమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న మానసిక, శారీరక ఒత్తిడి వంటి సమస్యలు యువతలో గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరుగుతుందో.. మనిషిలో శారీరక శ్రమ కూడా అంతే స్థాయిలో తగ్గుతూ వస్తోంది. దానికితోడు వేపుళ్లు వంటి ఆహార పదార్థాలు మరింత ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
చదువుకుంటున్న యువతలో విద్యాపరమైన ఒత్తిళ్లు, వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్న యువతలో పని ఒత్తిళ్లు వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సమస్యలే యువత గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు ఇదే సమస్య యువతనే కాదు.. వారి కుటుంబసభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అంశంపై ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, కార్డియాక్ సైన్సెస్ విభాగం అధిపతి డాక్టర్ బల్బీర్ సింగ్ గుండె జబ్బులకు కారణమయ్యే అంశాలు ఏంటనేది వివరించారు.
యువకులలో గుండె సమస్యలు పెరగడానికి కారణాలు ఏంటంటే..
డాక్టర్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ, " పాశ్చాత్య దేశాల కంటే మన దేశంలోనే కనీసం ఒకటి లేదా రెండు దశాబ్దాల ముందుగానే గుండె జబ్బుల బారిన పడుతున్నాం అని అన్నారు. మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి మరో కారణం భారత్ లో మధుమేహం సమస్య కూడా అధికంగా ఉండటమే " అని బల్బీర్ సింగ్ వివరించారు.
" ప్రపంచ దేశాల కంటే మన ఇండియాలోనే అత్యధిక సంఖ్యలో డయాబెటిస్ పేషెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా బై బీపీ, స్మోకింగ్ కేసులు కూడా ఎక్కువే. పాశ్చాత్య దేశాల్లో స్మోకింగ్ అలవాట్లు తగ్గుతుండగా.. మన దేశంలో పొగరాయుళ్ల సంఖ్య ఇంకా ఎక్కువ అవుతోంది. ఇవన్నీ కూడా ఆందోళనకరమైన అంశాలే " అని డా బల్బీర్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Side Effects of Eating Pears: వీళ్లు కానీ బేరిపండు తిన్నారో.. ఇక అంతే సంగతి !!
డాక్టర్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ, " యువతలో జంక్ ఫుడ్ తినే అలవాటు బాగా పెరుగుతోంది. కేలరీలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్, రెడ్ మీట్ వంటివి మార్కెట్లో విరివిగా లభించడం, యువత వాటి పట్లనే ఎక్కువగా ఆకర్షితులు అవడం జరుగుతోందని.. అందువల్లే యువతలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి అని అన్నారు. ఇదేకాకుండా ఆల్కాహాల్, స్మోకింగ్ అలవాట్లు యువత ఆరోగ్యానికి మరింత తూట్లు పొడుస్తున్నాయి. తాజా పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ నేటి యువత షాపింగ్ మాల్స్ లో లేదా స్ట్రీట్ ఫుడ్స్ లోనో లభించే జంక్ ఫుడ్ కే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారని డా బల్బీర్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. జీవన శైలి, జంక్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి యువతలో గుండె సమస్యలకు ఒక కారణమైతే.. విపరీతమైన మానసిక, శారీరక ఒత్తిడి మరో కారణంగా నిలుస్తోంది అని డా బల్బీర్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : Calcium Rich Foods: క్యాల్షియం లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు.. క్యాల్షియం అధిక మోతాదులో ఉండే ఫుడ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి