Tea Side Effects: దేశంలో టీ ప్రేమికులకు కొదవ లేదు. ఉదయం లేవగానే మార్నింగ్ టీ నుంచి మొదలై రోజంతా అప్పుడప్పుడూ తాగుతూనే ఉంటారు. ఇంకొంతమందైతే ఎన్నిసార్లు టీ తాగుతారో లెక్కే ఉండదు. తెలిసో తెలియకో చేసే ఈ అలవాటు వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంటుంది.
టీ ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది ఇప్పటికీ చాలామందికి ఉన్న సందేహం. కొందరు టీ తాగితే యాక్టివ్‌గా ఉంటారంటారు. కొందరైతే టీ మంచిది కాదంటారు. వాస్తవం ఏంటంటే టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫీన్ కారణంగా మెదడు కాస్త ఉత్తేజితమౌతుంది. అయితే కాస్సేపు రిలాక్సేషన్ కోసం ఆరోగ్యం పాడుచేసుకోవడమే అవుతుంది. అంటే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమే. ఆ నష్టాలేంటనేది పరిశీలిద్దాం. అదే సమయంలో టీని పదే పదే వేడి చేసుకుని తాగడం అసలు మంచిది కాదు. దీనివల్ల టీ తో కలిగే దుష్పరిణామం ఇంకాస్త పెరిగిపోతుంది.
స్థూలకాయం తగ్గించుకోవాలంటే టీ అలవాటు మానుకోవల్సిందే. టీ అతిగా తాగడం వల్ల స్ఖూలకాయం సమస్య రావచ్చు. అందుకే టీకు దూరంగా ఉండాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కొన్ని పదార్ధాలను రోజువారీ ఆహారం నుంచి దూరం చేయాలి. అందులో ఒకటి టీ. టీలో ఉండే కెఫీన్ అనేది గుండెకు ఏ మాత్రం మంచిది కాదు.
కొంతమంది చాలాసార్లు టీ తాగుతుంటారు. దీనివల్ల కెఫీన్పై ఆధారపడటం ఎక్కువైపోతుంటుంది. ఇది దీర్ఘకాలంలో హాని కలిగిస్తుంది. ఎంత అలవాటు పడతారంటే టీ తాగకపోతే తలపోటు, అసౌకర్యం, చికాకు వంటి అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. టీలో ఉండే కెఫీన్ న్యూరాన్స్పై ప్రభావం చూపించడజం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
అన్నింటికంటే ప్రమాదకరమైంది మధుమేహం. ఇప్పటి వరకూ సరైన చికిత్స లేని వ్యాధి ఇది. అయితే డైట్ ద్వారా నియంత్రించుకోవచ్చు. టీ అదే పనిగా తాగేవారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. కొంతమంది ఉదయం లేచిన వెంటనే మార్నింగ్ టీ తప్పకుండా తాగుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణక్రియ పాడవుతుంది. కడుపులో సమస్య ఉత్పన్నం కావచ్చు.
Also read: Running Tips: రోజూ రన్నింగ్ చేస్తున్నారా, ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook