Control Blood Sugar Levels With Tea: ప్రస్తుతం డయాబెటిస్ అనేది సాధారణ సమస్యగా మారింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఇటీవలే పరిశోధనలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను తెలియజేశాయి. ప్రతి వంద మందిలో 30 నుంచి 40 మంది వరకు డయాబెటిస్ బారిన పడుతున్నారని.. చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజుకు పెరుగుతోందని వెల్లడించాయి. ఇదిలాగే ఉంటే రాబోయే రోజుల్లో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలేంటో.. మధుమేహం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలామంది ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఈ డయాబెటిస్ కారణంగా కొంతమందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. దీంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన గుండెపోటు, రక్తపోటు వంటి సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించాలి.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించుకోవడానికి.. గ్రీన్ టీ కి బదులుగా మెంతులతో తయారుచేసిన టిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా రక్తం లోని చక్కెర పరిమాణాలను నియంత్రించడమే కాకుండా మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా ఈ టీ ప్రభావంతంగా శరీర బరువును తగ్గించగలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు వ్యాయామాలు చేసిన తర్వాత ఈ టీ ని ప్రతిరోజు తాగితే వేగంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని వారంటున్నారు.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు చెంచాల మెంతి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని రెండు కప్పుల నీటిలో నానబెట్టి గంట తర్వాత.. స్టౌ పై మరిచి ఫిల్టర్ చేసుకొని తాగితే, సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అదనంగా ఈ టీ నుంచి పోషకాలు పొందడానికి ఇందులో నిమ్మకాయ రసంతో పాటు తేనెను కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని తాగడం వల్ల శరీరానికి మరెన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం