Realme C51 Launched in India: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రియల్‌మి నుండి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి అని రియల్‌మి ప్రకటించింది. ఇందులో ఐఫోన్ వంటి డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా ఉంది. దీనికే రియల్‌మి కంపెనీ మినీ క్యాప్సూల్ అని పేరు పెట్టుకుంది. ఈ రియల్‌మి C51 స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరాతో పాటు UNISOC T612 ప్రాసెసర్, 64GB స్టోరేజ్‌తో వస్తోంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేటుతో గేమింగ్ కి సైతం సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా, ఇన్ఫినిక్స్ ఇటీవల లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లకు రియల్‌మి C51 గట్టి పోటీని ఇస్తుంది అని రియల్ మి కంపెనీ భావిస్తోంది.
రియల్‌మి C51 ధర, అమ్మకాలు ఎప్పుడు మొదలవుతాయంటే..
రియల్‌మి అందించిన తాజా అప్‌డేట్స్ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,499 గా మాత్రమే ఉండనుంది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అవుతుందన్నమాట. లాంచింగ్ డే సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుండే రియల్‌మి C51 ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇవాళ కేవలం 2 గంటల పాటు మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే సేల్ అందుబాటులో ఉందన్నమాట. అంతిమంగా ఫస్ట్ సేల్ మాత్రం సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది అని రియల్‌మి కంపెనీ వెల్లడించింది.
ఇప్పటికే రియల్‌మి C51 ఫోన్ ఖరీదు రూ. 8499 మాత్రమే కాగా.. ICICI లేదా SBI కార్డుల ద్వారా పేమెంట్ చేసిన వారికి మరో 500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్‌మి C51 ఫోన్ డిజైన్ ఎలా ఉందంటే..
స్టైలిష్‌గా మెరుస్తూ కనిపించే రియల్‌మి C51 ఫోన్ డిజైన్ కూడా కస్టమర్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్ మెరిసే గ్లాస్ పౌడర్‌తో తయారైంది. ఈ ఫోన్ కేవలం 7.99 మిమీ మందంతో చాలా సన్నగా.. తేలికగా ఉంది. దీని బరువు కూడా కేవలం 186 గ్రాములే ఉంది. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఐఫోన్ 14 మొబైల్ తరహాలోనే మినీ క్యాప్సూల్ ఫీచర్ ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణగా రియల్‌మి కంపెనీ చెబుతోంది.
ఇది కూడా చదవండి : Cheap And Best 5G Phones: చీప్ అండ్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్
రియల్‌మి C51 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే..
6.74-అంగుళాల HD + డిస్‌ప్లేతో రూపొందిన ఈ రియల్‌మి C51 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ అందిస్తోంది. UNISOC T612 ప్రాసెసర్ ని అమర్చారు. ఇక ర్యామ్, స్టోరేజ్ విషయానికొస్తే.. 4GB RAM, 64GB మెమొరీ ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50MP AI ప్రైమరీ కెమెరా ఉండగా, 0.8MP సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 5MP కెమెరాను అమర్చారు. రియల్‌మి C51 ఫోన్ నైట్ మోడ్‌లో షూట్ చేసిన ఫోటోలు చాలా బాగున్నాయని రియల్ మి కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా రియల్‌మి C51 ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అమర్చారు. 33W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 28 నిమిషాల్లో 0 నుండి 50% వరకు ఛార్జ్ అవగలదు.
ఇది కూడా చదవండి : iPhone 14 Stolen By Woman: సెక్యురిటీ వైర్ కొరికేసి మరీ ఐ ఫోన్ చోరీ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి