Rx 100 Sound Viral Video: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పించే విధంగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేసే వైరల్ వీడియోలే ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవలే ఓ 15 ఏళ్ల బాలుడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోని చూసిన నెటిజన్లు అది నాలుకన లేదా ఆర్ఎక్స్ 100 బైకా అని అంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఆ బాలుడు ఏం చేశాడు. RX 100 బైక్ అనడానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ 15 ఏళ్ల బాలుడు అచ్చం తన నాలుక సాయంతో యువతకు ఇష్టమైన యమహా ఆర్ఎక్స్ 100 బైక్ నుంచి వచ్చే సౌండ్ లాగా మిమిక్రీ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ బైక్ అంటే ఇష్టం ఉన్నవారు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పిల్లాడు త్వరలోనే మంచి సెలబ్రిటీ అవుతాడని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. మనం చాలామంది మిమిక్రీలు చేసేవాళ్లను చూసి ఉంటాం.. కానీ వాళ్లు ఇంతవరకు బైక్ శబ్దాలను కానీ.. కొన్ని మంచి వెలుపడే శబ్దాలను మిమిక్రీ చేయలేకపోయారు. అయితే ఈ బాలుడు ఇలా బైక్ శబ్దాన్ని మిమిక్రీ చేయడంతో నిటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చిన్నప్పుడు చాలా వరకు వీడియో గేమ్స్ ఉండేవి కాకపోయేవి. దీంతో పిల్లలంతా ఒక చోటికి చేరి గేమ్స్ ఆడటం కానీ, సైకిల్ టైర్లతో బైక్ రన్నింగ్ పోటీ లాంటివి పెట్టుకునేవారు. ఇందులో భాగంగానే చాలామంది వాహనాలకు సంబంధించిన శబ్దాలు చేయడం, వాటి నుంచి వచ్చే శబ్దాలు గమనించి వాటిలా నోటి నుంచి మిమిక్రీ చేయడం వంటివి చేసేవారు. కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి మీకు ఇవి చాలా వరకు గుర్తుండకపోవచ్చు అని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
ఈ వీడియోను మొదటగా ఓ వ్యక్తి ఆ బాలుడి పేరు చెప్పి ప్రారంభించాడు. బాలుడు ఈరోజు నేను ఆర్ఎక్స్ 100 బైక్ సౌండ్ చేయబోతున్నాను అని చెప్పి.. అచ్చం బైక్ లాంటి శబ్దాన్ని తన నాలుకతో మిమిక్రీ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను Royal_kastkar__ అనే ఇన్‌స్టాగ్రామ్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ త్వరలోనే ఈ బాలుడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడని కొందరు అంటుంటే.. మరికొందరైతే.. గ్రీన్ చట్నీ తో సమోసా తిన్నప్పుడు ఇలానే అనిపిస్తుందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సౌండ్ చేయడానికి ఒక మంచి ప్రతిభ ఉండాల్సిందే.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook