ట్రంప్‌కు సొంత మనుషుల నుండే వ్యతిరేకత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాలనపై తన సొంత ప్రభుత్వంలోని వ్యక్తులే వ్యతిరేకత కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Last Updated : Sep 6, 2018, 11:12 PM IST
ట్రంప్‌కు సొంత మనుషుల నుండే వ్యతిరేకత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాలనపై తన సొంత ప్రభుత్వంలోని వ్యక్తులే వ్యతిరేకత కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆయనకు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్‌లో ఓ ప్రభుత్వ అధికారి వ్యాసం రాశారు. ప్రస్తుతం ఆ వ్యాసం అమెరికాలో పెద్ద దుమారమే రేపుతోంది. ట్రంప్‌ను అధ్యక్షుడిగా తొలిగించాలని ఆయన ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు ఆయనకు తెలియకుండా పావులు కదిపారని.. ఒకానొక సందర్భంలో స్వయాన క్యాబినెట్ సభ్యులే ఆ నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వచ్చారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

అయితే అలా చేయడం వల్ల చాలా విపరీత పరిణామాలను దేశం ఎదుర్కోవలసి వస్తుందని భావించి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని ఆ వ్యాసంలో తెలియజేశారు. ట్రంప్ తీసుకొనే నిర్ణయాలు కొన్ని తలనొప్పిగా తయారవ్వడమే అప్పట్లో ఆ నిర్ణయాన్ని తాము తీసుకోవడానికి కారణమని ఆ వ్యాసకర్త తెలిపారు. వ్యాసకర్త మారుపేరుతో ఆ వ్యాసాన్ని ప్రచురించడంతో ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై విరుచుకుపడ్డారు. దీనిని పిరికిపందల చర్యగా కొట్టిపారేశారు.

ఈ క్రమంలో శ్వేతభవనం కార్యదర్శి సారా శాండర్స్ ఈ వ్యాసాన్ని ప్రచురించిన పత్రికకు ఫోన్ చేసి.. బేషరతుగా అధ్యక్షుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఈ వ్యాసాన్ని ప్రచురించిన వ్యక్తి పేరును బహిర్గతం చేయాలని తెలిపారు. "ఫెయిలింగ్ న్యూయార్క్ టైమ్స్" అని అప్పటికే ట్రంప్ ట్వీట్ చేశారు. 

Trending News