Mars set 2023: కన్యారాశిలో అంగారకుడు అస్తమయం.. ఈ 4 రాశుల జీవితం కష్టాలమయం..

Mars set 2023: మరో ఐదు రోజుల తర్వాత అంగారకుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2023, 06:53 PM IST
Mars set 2023: కన్యారాశిలో అంగారకుడు అస్తమయం.. ఈ 4 రాశుల జీవితం కష్టాలమయం..

Mangal Asta 2023 effect: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ధైర్యాన్ని ఇచ్చే కుజుడు సెప్టెంబరు 24న కన్యారాశిలో అస్తమించనున్నాడు. సాధారణంగా గ్రహాల అస్తమయం అశుభకరమైనదిగా భావిస్తారు. కుజుడు అస్తమించే సమయం నాలుగు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అంగారకుడి సెట్ అస్సలు కలిసిరాదు. మీరు ప్రతి పనిలో వైఫల్యాలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఆఫీసులో సహచరుల సపోర్టు లభించదు. మీరు ఉద్యోగం కోసం మరికొంత కాలం వేచిచూడాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. 
సింహరాశి 
సింహరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ చేసేవారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ టైం అస్సలు కలిసిరాదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోండి. మీ కెరీర్ అంత బాగుండదు. 
మేషరాశి
అంగారకుడి అస్తమయ సమయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీరు జాబ్ కోసం మరికొంత కాలం వేచిచూడాల్సి వస్తుంది. వ్యాపారులు భారీగా నష్టపయోయే అవకాశం ఉంది. కొన్ని విషయాలు మీ కుటుంబాన్ని కుదిపేస్తాయి. 
వృషభం
కుజుడు అస్తమయం వృషభరాశి వారికి అస్సలు కలిసిరాదు. మీరు ఈ సమయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆఫీసులో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం తగ్గచ్చు. మీ కష్టాలు పెరుగుతాయి. 

Also Read: Saturn Transit 2023: శని ప్రభావంతో ఈ 4 రాశులకు నవంబర్ 4 నుంచి మహర్దశ, ఉద్యోగులు, వ్యాపారులకు వద్దంటే డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News