Dengue Fever Prevention: దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి దోమల కాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూతో బాధపడేవారు తీవ్ర జ్వరం, కండరాలు, కీళ్లలో నొప్పి, తలనొప్పి మొదలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ వ్యాధి కారణంగా కొంతమందిలో రక్తంలోని ప్లేట్లెట్లు కూడా వేగంగా తగ్గిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర వ్యాధుల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే మీరు కూడా రక్తంలోని ప్లేట్లెట్ కౌంట్స్ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ కింది ఫ్రూట్స్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
కివి పండ్లు:
కివి పండ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇది డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు జీర్ణక్రియను కూడా మెరుగుపరుచుతుంది. దీంతో పాటు ప్లేట్లెట్ కౌంట్ పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
దానిమ్మ:
దానిమ్మ శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి డెంగ్యూ వ్యాధితో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో ఎర్రరక్తకణాలను సంఖ్యను పెంచేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
బొప్పాయి:
బొప్పాయి ఆకులు డెంగ్యూకి ఔషధంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఆకులతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల కూడా ప్లేట్ లేట్స్ పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. బొప్పాయిలో ఫైబర్ అధికంగా మోతాదులో లభిస్తుంది. దీని కారణంగా డెంగ్యూ జ్వరం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నీరు:
డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు కొబ్బరి నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి