Black Pepper Benefits For Eyes: భారతీయ వంటగదిలో ఎక్కువగా వినియోగించేవాటిలో నల్ల మిరియాలు ఒకటి. వీటిని ప్రతి రోజు సరైన మోతాదులో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నల్ల మిరియాలు కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి:
నల్ల మిరియాల్లో విటమిన్లు A, C, Eతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే లుటీన్, జియాక్సంతిన్ కంటి పొడి, దురద సమస్యలను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. నల్ల మిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కళ్ళు వాపు వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ కంటి కండరాలను రిలాక్స్ చేసేందుకు కూడా సహాయపడతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
తరచుగా కంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు కంటి కలక వంటి సమస్యలను కూడా ప్రభావంతంగా తగ్గిస్తాయి. ప్రస్తుతం చాలా మంది అతిగా కంప్యూటర్లను చూడడం వల్ల తీవ్ర కంటి నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. దీంతో చాలా మందిలో కంటి రక్తనాళాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి నల్ల మిరియాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు అందించిన ప్రకారం..నల్లమిరియాలను పొడి చేసి ఉండలుగా తయారు చేసి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి