Diabetes Remedy: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా మధుమేహానికి ఇంకా చికిత్స మాత్రం అందుబాటులో లేదు. మధుమేహం ఎంత ప్రమాదకరమైందో..నియంత్రణ కూడా అంతే సులభం. ఎందుకంటే నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
డయాబెటిస్ నియంత్రించేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అయిష్టమైనా సరే మధుమేహం నుంచి విముక్తి పొందేందుకు కాకరకాయ జ్యూస్ తాగుతుంటారు. కానీ ఇది మధుమేహానికి అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఎ పోషకాలు బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్, స్థూలకాయం, థైరాయిడ్ వంటి ఇతర సమస్యల్ని కూడా తగ్గించడంలో దోహదపడతాయి. అయితే చాలామంది చేదుగా ఉంటుందనే కారణంతో కాకరకాయ జ్యూస్ తాగలేరు. చేదు లేకుండా కూడా కాకరకాయ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు పౌష్ఠిక గుణాలు కలిగి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కాకరకాయ జ్యూస్ తయారు చేసేందుకు ముందుగా కాకరకాయల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత మధ్యలో కట్ చేసి మధ్యలో భాగం తొలగించాలి. కాకరకాయ తొక్క కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కావడం వల్ల తొక్కతో సహా తీసుకోవాలి. జ్యూసర్లో జ్యూస్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పింక్ సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. అంతే వడపోసి సేవించడమే. కాకరకాయ విత్తనాలు జ్యూస్‌లో లేకుండా చూసుకోవాలి.
కాకరకాయ జ్యూస్‌తో కేవలం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గించుకోవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలి తగ్గడమే కాకుండా బరువు నియంత్రణలో ఉంటుంది. కాకరకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు వల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. కాకరకాయ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల కేన్సర్ నుంచి పోరాడే శక్తి లబిస్తుంది. కొన్ని రకాల కేన్సర్ కణాలు అంతమౌతాయి. కాకరకాయ జ్యూస్ రోజూ తాగడం వల్ల ఇందులో ఉండే పొటాషియం వల్ల గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మరి కాకరకాయ జ్యూస్ ఏ సమయంలో తాగాలనేదే అసలు ప్రశ్న. కాకరకాయ జ్యూస్‌ను రోజూ పరగడుపున ఉదయం వేళ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే పరగడుపున తీసుకుంటే అందులోని పోషకాలు అద్భుతంగా శరీరంలోకి సంగ్రహించబడతాయి.
Also read: Stomach Cancer Symptoms: ఛాతీలో మంట తరచూ వేధిస్తోందా అయితే కడుపు కేన్సర్ కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook