Purple Cabbage Benefits: పర్పుల్ క్యాబేజీతో శరీరానికి బోలెడు లాభాలు..క్రమం తప్పకుండా ఇలా తినండి చాలు!

Purple Cabbage Benefits: పర్పుల్ క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 01:19 PM IST
Purple Cabbage Benefits: పర్పుల్ క్యాబేజీతో శరీరానికి బోలెడు లాభాలు..క్రమం తప్పకుండా ఇలా తినండి చాలు!

Purple Cabbage Benefits: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. మార్కెట్‌లో ప్రతి సీజన్‌కు సంబంధించిన కూరగాయలు లభిస్తున్నాయి. ఏ సీజన్‌కు సంబంధించిన ఆ కూరగాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పోషకాలు కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. క్రమం తప్పకుండా  పర్పుల్ క్యాబేజీని తీసుకోవడం వల్ల మరెన్నో లాభాలు పొందుతారు. ఇందులో ఐరన్, విటమిన్ సి, పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. 

హైబీపీని నియంత్రిస్తుంది:
మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా పర్పుల్ క్యాబేజీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. 

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
పర్పుల్ క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అధిక పరిమాణంలో విటమిన్‌ సి లభిస్తుంది. దీంతో శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిని క్రమం తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటారు. ఈ క్యాబేజీలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్స్‌ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఎముకల ఆరోగ్యానికి..
పర్పుల్ క్యాబేజీలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం ఆహరంలో తీసుకోవడం వల్ల ఎముకల నొప్పులు, వాపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో విటమిన్ కెతో పాటు పొటాషియం కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. దీని వల్ల కండరాల సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది:
పర్పుల్ క్యాబేజీలో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల జీర్ఱవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఉడికించిన క్యాబేజీని  తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News