TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!

TCS Recruitment 2023 For Freshers: ఒకేసారి భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్‌కు టీసీఎస్ రెడీ అవుతోంది. ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా ప్రస్తుత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా లేదన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 01:30 PM IST
TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!

TCS Recruitment 2023 For Freshers: ఈ ఏడాది ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌మెంట్ చేసుకోమని ప్రముఖ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించగా.. లక్షలాది మంది విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీసీఎస్ సీఓఓ ఎన్.గణపతి సుబ్రమణ్యం తెలిపారు. కాగా.. ఇప్పటికే ప్రతి ఏడాది 35 వేల నుంచి 40 వేల మంది వరకు కొత్త ఉద్యోగులను టీసీఎస్ నియమించుకుంటోంది. 

అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సీఓఓ తెలిపారు. కంపెనీలో పెద్ద ఎత్తున తొలగింపులు ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం కొత్త నియామకాలతో ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు.

ఐటీ రంగంలోని ఇతర ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు నిర్వహించబోమని ప్రకటించి విద్యార్థులకు షాకిచ్చింది ఇన్ఫోసిస్. గతేడాది 50 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్ వెల్లడించారు. డిమాండ్‌ పెరిగే వరకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్ చేపట్టబోమని చెప్పారు.

లేటరల్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలను నిలజన్ రాయ్ తోసిపుచ్చలేదు. తమ కంపెనీ నియామక డిమాండ్‌తో ముడిపడి ఉంటుందన్నారు. గతేడాది ఉన్న డిమాండ్‌కు ముందు 50 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నామని.. ఇప్పటికీ వారు పనిచేస్తున్నారని చెప్పారు. వారికి ఏఐ మొదలైన వాటిలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తాము క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు వెళ్లడం లేదని.. తమ భవిష్యత్తు అంచనాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి త్రైమాసికంలో మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు. కొత్త ప్రాజెక్ట్ రాగానే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొదలవుతుందన్నారు.

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  

Also Read: Health Tips: డైట్‌లో ఈ పదార్ధాలుంటే, వయాగ్రా కంటే అద్భుతంగా మీ లైంగిక సామర్ధ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News