ICC World Cup 2023 Points Table and Records: వన్డే వరల్డ్ కప్ 2023 పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే 14 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇండియా, న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రెండు మ్యాచ్ ల్లో గెలుపొందిన సౌతాఫ్రికా మూడో స్థానంలో, పాకిస్థాన్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ ఐదో స్థానంలో, ఆఫ్గానిస్తాన్ ఆరో స్థానంలో, బంగ్లాదేశ్ ఏడో స్థానంలో ఉన్నాయి. మూడు మ్యాచుల్లో ఓడిపోయిన తర్వాత నిన్న శ్రీలంకపై గెలిచింది ఆస్ట్రేలియా. దీంతో పాయింట్ల టేబుల్ లో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయిన శ్రీలంక తొమ్మిదో స్థానంలో, ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయిన నెదర్లాండ్స్ చివరి స్థానంలోనూ కొనసాగుతున్నాయి.
బ్యాటర్లలో అతడే టాప్..
ఈ ప్రపంచకప్ లో అక్టోబరు 16 వరకు 14 మ్యాచులు జరిగాయి. ప్రస్తుతానికి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 248 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండోస్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే (229), మూడోస్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (217) ఉన్నారు.నాలుగో స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (209), ఐదో స్థానంలో శ్రీలంక బ్యాటర్ కుశల్ మెండిస్ (207) కొనసాగుతున్నారు.
బౌలర్లల్లో అతడే టాప్..
వరల్డ్ కప్ లో ప్రస్తుతానికి అత్యధిక వికెట్ల జాబితాలో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ లో కొనసాగుతున్నాడు. బుమ్రా మూడు మ్యాచ్ లలో 8 వికెట్లు తీశాడు. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, మరో న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ కూడా 8 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పాకిస్థాన్ పేస్ బౌలర్ హసన్ అలీ, శ్రీలంక పేస్ బౌలర్ మధుశంక ఏడేసి వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
Also Read: AUS vs SL Highlights: వరల్డ్ కప్ లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘన విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..