Spark life Song: 'స్పార్క్ లైఫ్'’నుంచి మూడో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'జ్ఞాపకాలు' సాంగ్..

Spark life Movie: విక్రాంత్, మెహరీన్, రుక్షర్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం స్పార్క్ లైఫ్. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2023, 02:44 PM IST
Spark life Song: 'స్పార్క్ లైఫ్'’నుంచి మూడో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'జ్ఞాపకాలు' సాంగ్..

Spark life third single Out: అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న 'స్పార్క్ లైఫ్'’ సినిమాతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో(Spark life Movie) హీరోగా చేయడంతోపాటు కథా రచన, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నారు. ఈ మూవీలో మెహరీన్ పిర్జాడా, రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హృదయం, ఖుషి చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళీ నటుడు గురు సోమసుందరం ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు చిత్రం త్వరలోనే రాబోతోంది. మొత్తం ఐదు భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.

ఈ సైకాలిజికల్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 17న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలు, ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచాయి. తాజాగా థర్డ్ సింగిల్ ‘'జ్ఞాపకాలు'’ అనే పాటను రిలీజ్ చేశారు. హేషమ్ బాణీ, అనంత శ్రీరామ్ సాహిత్యం, హేషమ్ కృష్ణ లాస్య ముత్యాల గాత్రం ఈ పాటను ఎంతో వినసొంపుగా మలిచాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమని చాటి చెప్పేలా ఈ పాట ఉంది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీనే హైలెట్‌గా ఆ పాట సాగుతుంది. విజువల్స్ సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉన్నాయి. 

విక్రాంత్, మోహరీన్, రుక్షర్ ధిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News