Vishwak Sen: దుమారం రేపుతున్న విశ్వక్ సేన్ ట్వీట్, ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుసా

Vishwak Sen: టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ డమ్ కాదు గానీ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు విశ్వక్ సేన్. సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విశ్వక్ సేన్..మరో వివాదానికి తెరతీశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2023, 10:39 AM IST
Vishwak Sen: దుమారం రేపుతున్న విశ్వక్ సేన్ ట్వీట్, ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుసా

Vishwak Sen: చేసిన సినిమాలు తక్కువే అయినా క్రేజ్ మాత్రం పెద్దఎత్తునే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విశ్వక్ సేన్ చేసిన 4-5 సినిమాలతోనే ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తరచూ సంచలన వ్యాఖ్యలతో హల్‌చల్ చేసే విశ్వక్ మరోసారి దుమారం రేపాడు. విశ్వక్ చేసిన వ్యాఖ్యలేంటి, ఎవరిని ఉద్దేశించి చేశాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

టాలీవుడ్ అప్‌కమింగ్ నటుల్లో ఒకడు విశ్వక్ సేన్. హిట్ సినిమాతో సుపరిచితమైన విశ్వక్ సేన్ ఆ తరువాత ఓరి దేవుడా, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ముఖచిత్రం, వెళ్లిపోమాకే చిత్రాల్లో నటించాడు. తాజాగా దాస్ కా ధమ్కీతో హిట్ కొట్టాడు. మరో మూడు సినిమాలు షెడ్యూల్  అయున్నాయి. తరచూ సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ అవుతుంటాడు. అందరిలో చర్చనీయాంశమౌతుంటాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే సంపాదించాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేపధ్యంలో విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడా అనే చర్చ జరుగుతోంది. 

విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ ఇది

బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దామని అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా..డిసెంబర్ 8న వస్తున్నా..హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ మీ డెసిషన్.

ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. బహుశా సినిమా విడుదల తేదీ విషయంలో ఏదైనా జరిగిందా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే డిసెంబర్ కాకుండా జనవరిలో విడుదలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అందుకే విశ్వక్ ఇలా ట్వీట్ ద్వారా ఫైర్ అయినట్టు సమాచారం. ప్రతి చిన్న దాన్ని ఇలా వివాదం చేయడం మంచిది కాదని కొందరు సూచిస్తున్నారు. మీ తండ్రి రాజకీయ నాయకుడు కాబట్టి ఆ అవకాశం వచ్చింది, సంతోషించు తంబి అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. 

ఫక్తు తెలంగాణ కుర్రోడు విశ్వక్ సేన్, గోదావరి నేపధ్య సినిమాలో చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ కొన్ని యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ప్రధాన హీరోయిన్ పాత్రల్లో కన్పిస్తారు. 

Also read: Pawan kalyan: అబ్బాయి పెళ్లి కోసం ఇటలీ బయల్దేరిన పవన్‌ కల్యాణ్, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News