Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్‌లో జాబ్స్.. రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ జీతం

నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.  స్పెషలిస్ట్ ఆఫీసర్, రిస్క్ మేనేజర్‌తో సహా అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 12:52 PM IST
Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్‌లో జాబ్స్.. రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ జీతం

Central Bank Jobs: నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్, రిస్క్ మేనేజర్‌తో సహా పలు పోస్టుల భర్తీకి బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ  ఉద్యోగం చేయటానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి  మరియు అర్హులైన సభ్యులు సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbank.net.in ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 19 నవంబర్ 2023 కాగా.. పరీక్ష తేదీ ఇంకా విడుదల కాలేదు. 

అర్హత.. 
విద్యా అర్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి డిగ్రీ పొందిన అభ్యర్థుల మాత్రమే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇతర పోస్ట్ లతో స్పెషలిస్ట్ ఆఫీసర్ మరియు రిస్క్ మేనేజర్‌ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఆయా ఫీల్డ్‌లో 1 నుండి 2 సంవత్సరాల పని అనుభవంతో పాటు సంబంధిత పనిపై అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి. 

ఎలా అప్లై చేసుకోవాలి..? 

  • మొదటగా centralbank.net.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి 
  • వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోటానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.
  • దరఖాస్తు, సంతకం, ఫోటో, ఐడి ప్రూఫ్‌కు సంబంధించిన అన్ని అవసరమైన డాక్యుమెంట్ లను జాగ్రత్తగా అప్‌లోడ్ చేయండి.
  • తరువాత దరఖాస్తు ఫీ చెల్లించండి.
  • సమర్పించిన దరఖాస్తు ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

జీతం వివరాలు.. 

  • స్కేల్ 1- జీతం రూ. 36,000 నుండి రూ. 63,840 వరకు 
  • స్కేల్ 2- జీతం రూ. 48,170 నుండి  రూ. 68,810 వరకు 
  • స్కేల్ 3- జీతం రూ. 63,840 నుండి రూ. 78,230 వరకు 
  • స్కేల్ 4- జీతం రూ. 76,010 నుండి రూ. 89,890 వరకు 
  • స్కేల్ 5- జీతం రూ. 89,890 నుండి రూ. 1,00,350 వరకు 

Also Read: Lakshmi Narayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో లక్ష్మీ నారాయణ ఏమన్నారు

ఖాళీ వివరాలు.. 

  • లా ఆఫీసర్ - 15 పోస్టులు 
  • క్రెడిట్ ఆఫీసర్ - 11 నుండి 50 పోస్టులు 
  • ఆర్థిక విశ్లేషకుడు - 11 నుండి 14 పోస్టులు 
  • CA – ఫైనాన్స్ & ఖాతా- 3 పోస్టులు 
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 15 పోస్టులు 
  • రిస్క్ ఆఫీసర్ |- 15 పోస్టులు 
  • సమాచార సాంకేతికత 111- 2 పోస్టులు 
  • లైబ్రేరియన్-1 పోస్టులు 
  • రిక్స్ మేనేజర్-1 పోస్టులు 
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 111- 6
  • ఆర్థిక విశ్లేషకుడు ||-5 పోస్టులు 
  • సమాచార సాంకేతికత II- 73 పోస్టులు 

Also Read: Vizianagaram Train Accident News: విజయనగరం రైలు ప్రమాదం లైవ్ అప్‌డేట్స్.. అసలు ఏం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News