South Africa Vs New Zealand Highlights: ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం పుణెలోని MCA స్టేడియంలో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (114) వాండర్ డసెన్ (133) సెంచరీలతో చెలరేగగా.. భారీ స్కోరు చేసింది. అనంతరం కివీస్ 35.3 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ (60) ఒక్కడే రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సఫారీ జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. టీమిండియా రెండోస్థానానికి పడిపోయంది. న్యూజిలాండ్‌కు ఏడు మ్యాచ్‌ల్లో మూడో ఓటమి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 358 న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తూ.. వరుస విరామల్లో వికెట్లు పడగొట్టారు. గ్లెన్ ఫిలిప్ 50 బంతుల్లో 60 పరుగులు చేయగా.. ఓపెనర్ విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) ఓ మాదిరి ఆడారు. న్యూజిలాండ్ జట్టులోని 8 మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. సూపర్ ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (9), డేవిడ్ కాన్వే (2), కెప్టెన్ టామ్ లాథమ్ (4), మిచెల్ శాంట్నర్ (7) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్కో యూన్సెన్ 3, గెరాల్డ్ కోట్జే 2, కగిసో రబాడ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. చెలరేగి ఆడింది. కెప్టెన్ బవుమా (24) విఫలమైనా.. క్వింటన్ డి కాక్, డస్సెన్ చెలరేగి ఆడారు. రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 238 పరుగుల వద్ద డికాక్ ఔట్ అయ్యాడు. క్వింటన్ డి కాక్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 ఫోర్ల సాయంతో 114 రన్స్ చేయగా.. డస్సెన్ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 133 పరుగులు చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ 30 బంతుల్లో నాలుగు సిక్సర్ల సాయంతో 53 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 10 ఓవర్లలో సఫారీ టీమ్ 119 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. డస్సెన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి