Big Diwali Sale: బిగ్‌ దీవాళి సేల్‌లో 65 inch QLED స్మార్ట్‌ టీవీలపై 71 శాతం తగ్గింపు..పెద్ద టీవీ, అతి తక్కువ ధరకే!

Big Diwali Sale Smart Tv Offers: అతి తక్కువ ధరకే 4k స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోరని బిగ్‌ దీవాళి సేల్‌లో భాగంగా 70 శాతం తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2023, 04:49 PM IST
Big Diwali Sale: బిగ్‌ దీవాళి సేల్‌లో 65 inch QLED స్మార్ట్‌ టీవీలపై 71 శాతం తగ్గింపు..పెద్ద టీవీ, అతి తక్కువ ధరకే!

 

Big Diwali Sale Smart Tv Offers: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో భాగంగా 65 అంగుళాల స్మార్ట్ టీవీలు బంపర్ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజే చివరి తేది కావడంతో అన్ని బ్రాండ్‌లకి సంబంధించిన స్మార్ట్‌ టీవీలపై 71 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌లో మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఆకర్షణీయమైన బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. మరింత అదనపు తగ్గింపు పొందాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే సేల్‌ ఏయే బ్రాండ్‌లకు సంబంధించి స్మార్ట్‌ టీవీలు అతి తక్కువ ధరకు లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

MOTOROLA EnvisionX 65 inch QLED స్మార్ట్‌ టీవీ:
ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్‌లో 65UHDGQMBSGQ మోడల్‌తో అందుబాటులో ఉంది. ఈ టీవీని కంపెనీ మార్కెట్‌లో MRP రూ. 1,40,500తో విక్రయిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లోని దీపావళి సేల్‌లో భాగంగా 71 శాతం తగ్గింపుతో రూ.39,999కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అదనపు తగ్గింపు పొందడానికి SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసే క్రమంలో బిల్‌ చెల్లిస్తే రూ.750 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ టీవీపై అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

SAMSUNG Crystal 4K iSmart Series 65 inch స్మార్ట్‌ టీవీ:
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్‌లో UA65CUE60AKLXL మోడల్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ టీవీ MRP ధర రూ.99,900తో అందుబాటులో ఉంది. దివాళి సేల్‌లో భాగంగా 35 శాతం తగ్గింపుతో రూ.63,990కే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ టీవీపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 

OnePlus U1S 65 inch స్మార్ట్ టీవీ:
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ వన్‌ఫ్లస్‌ స్మార్ట్ టీవీ 65UC1A00 మోడల్‌తో లభిస్తోంది. ఈ టీవీపై దీపావళి సందర్భంగా MRP ధరపై దాదాపు 32 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ టీవీని  రూ.69,999కి బదులుగా రూ.46,999కి కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ టీవీలను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరలకే పొందవచ్చు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News