Happy Diwali 2023: హిందూ సాంప్రదాయం ప్రకారం దీపావళి పండగ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండగను భారతీయుడు ప్రతి సంవత్సరం ఆరు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి పండగ నవంబర్ 12వ తేదీ ఆదివారం వచ్చింది. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలనుంచి ఉపశమనం లభించడమే కాకుండా కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది మహిళలు ఈరోజు ఉపవాసాలు ఆచరించి మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తారు. ఈ దీపావళి లక్ష్మీ పూజలో భాగంగా అమ్మవారికి సమర్పించే కొన్ని వస్తువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ పూజలో చాలామంది తామర పువ్వులు సమర్పిస్తారు. అసలు తామర పువ్వు ను ఎందుకు సమర్పిస్తాతో తెలుసా?, ఈ పువ్వు సమర్పించడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ పూజలో తామర పువ్వు ప్రాముఖ్యత:
లక్ష్మీ పూజలో భాగంగా 8 తామర పువ్వులను సమర్పించడం ఎంతో శ్రేయస్కరమని పురాణాల్లో పేర్కొన్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి తామర పువ్వు నుంచే అవతరించిందని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే పూజా సమయంలో తామర పువ్వులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. తామర పువ్వులను సమర్పించే సమయంలో చాలామంది భక్తులు బెల్లంతో తయారుచేసిన ఆహారాలను సమర్పిస్తూ ఉంటారు. ఇలా దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలో భాగంగా తామర పువ్వులను సమర్పించడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి.
లక్ష్మీ పూజ మంత్రం:
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్.
శ్రీ హ్రీ శ్రీ ఓం మహాలక్ష్మీ నమః॥
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
లక్ష్మీదేవి బీజామంత్రం:
ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి లక్ష్మీదేవి బీజం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని పఠించేవారు సులభంగా డబ్బు లేని సమస్యలనుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు. ఈ లక్ష్మీ బీజ మంత్రం ఎంతో శక్తివంతమైంది. కాబట్టి దీపావళి లక్ష్మీ పూజలో భాగంగా ఈ మంత్రాన్ని జపిస్తే తెలివితేటలు పెరగడమే కాకుండా జీవితంలో ఆనందం నెలకొంటుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఈరోజు లక్ష్మీ గణేశుడి పూజను ఆచరించేవారు తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది.
దీపావళి లక్ష్మీ పూజ విధానం:
- దీపావళి లక్ష్మీ పూజను ఆచరించేవారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
- శుభ్రం చేసుకున్న తర్వాత ఈశాన్యం ఉత్తర దిశలో బరువు కలిగిన వస్తువులను తీసి పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత గంగాజలంతో స్నానం చేసి ఎరుపు రంగుతో కూడిన పట్టు వస్త్రాలను ధరించాలి.
- పూజ గదిలోకి అడుగుపెట్టి ఈశాన్యం దిశలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆ వస్త్రం పై ఉంచాల్సి ఉంటుంది.
- లక్ష్మీదేవి విగ్రహాన్ని పాలు తేనెతో శుభ్రం చేసి అభిషేకాలు చేయడం ప్రారంభించాలి. ఆ తర్వాత వస్త్రాలు, నగలు, ధూపం, దీపం పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి.
- అమ్మవారిని అలంకరించిన తర్వాత పక్కనే గణేశుడు విగ్రహాన్ని కూడా ఉంచాలి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులను సమర్పించి పూజను ప్రారంభించాల్సి ఉంటుంది.
- పూజలో భాగంగా లక్ష్మీదేవి బీజాక్షరాన్ని జపిస్తూ సాష్టాంగ నమస్కారం చేయాలి.
- ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి. నెయ్యితో దీపాలు వెలిగించాలి.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook