Gmail Account: డిసెంబర్ 1 నుంచి లక్షలాది జీమెయిల్ ఎక్కౌంట్లు డిలీట్, మీ మెయిల్ ఐడీ ఉందా లేదా, ఎలా తెలుస్తుంది

Gmail Account: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ గురించి తెలియనవారుండరు. నూటికి 90 శాతమంది గూగుల్ ఉత్పత్తులపైనే ఆధారపడే పరిస్థితి అంటే అతిశయోక్తి కూడా కాకపోవచ్చు. జీమెయిల్ ఒక్కటే ఇందుకు ఉదాహరణ. మరి ఆ జీమెయిల్ విషయంలో ఇప్పుడు బిగ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 14, 2023, 09:59 AM IST
Gmail Account: డిసెంబర్ 1 నుంచి లక్షలాది జీమెయిల్ ఎక్కౌంట్లు డిలీట్, మీ మెయిల్ ఐడీ ఉందా లేదా, ఎలా తెలుస్తుంది

Gmail Account: గూగుల్ నుంచి ఇటీవల ఓ కీలకమైన అలర్ట్ యూజర్లకు జారీ అయింది. లక్షల కొద్దీ జీ మెయిల్ ఎక్కౌంట్లు డిలీట్ కానున్నాయనేది ఆ అలర్ట్ సారాంశం. ఆ డిలీట్ లిస్ట్‌లో మీ మెయిల్ ఉందా లేదా, ఎలా తెలుసుకోవడం. వచ్చే నెల అంటే డిసెంబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మెయిల్ ఎక్కౌంట్లు డిలీట్ కానున్నాయి. 

గూగుల్ సంస్థ తాజా జీమెయిల్ యూజర్లకు ఓ అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 30 వరకూ గడువిచ్చింది. ఈ గడువులోగా తమ మెయిల్ ఎక్కౌంట్లపై దృష్టి పెట్టకపోతే ఆ ఎక్కౌంట్లు ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. 2023 డిసెంబర్ నాటికి గత రెండేళ్లుగా వినియోగించని జీ మెయిల్ ఎక్కౌంట్లు ఉంటే వెంటనే వాటిని వినియోగంలోకి తీసుకురావల్సి ఉంటుంది. లేదంటే ఆ ఎక్కౌంట్లు ఇకపై పనిచేయకుండా పోతాయి. క్రమం తప్పకుండా జీమెయిల్, డాక్యుమెంట్స్, క్యాలెండర్, ఫోటోలు వినియోగించే ఎక్కౌంట్లకు ఏ ఇబ్బంది ఉండదు. చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉంటే డిలీట్ అయ్యేందుకు ఆస్కారముంటుంది. గత రెండేళ్లుగా జీమెయిల్ ఓపెన్ చేయకపోయినా, వినియోగించకపోయినా ఆ ఎక్కౌంట్ మాత్రం డిసెంబర్ 1న డిలీట్ అయ్యే జాబితాలో ఉంటుంది. 

సెక్యూరిటీ కారణాలతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే యాక్టివ్‌గా లేని ఎక్కౌంట్లను స్కామర్లు వినియోగించే అవకాశముంది. మర్చిపోయిన జీమెయిల్ ఎక్కౌంట్లు, వినియోగించకుండా వదిలేసినవి, పాత పాస్‌వర్డ్‌తో ఉన్నవి, 2 ఫ్యాక్టర్ ధృవీకరణ లేనివి స్కామర్ల చేతిలో పడవచ్చని గూగుల్ గుర్తించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

అందుకే మీక్కూడా అలాంటి జీ మెయిల్ ఎక్కౌంట్లు ఉంటే వెంటనే వినియోగంలో తీసుకొచ్చి, 2 ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ పెట్టుకుని, బలమైన పాస్‌వర్డ్ సెట్ చేసుకోగలరు. లేకపోతే స్కామర్లు చేతిలో పడే అవకాశముంది లేదా డిసెంబర్ 1 నుంచి డిలీట్ కావచ్చు.

Also read: PPF Investment: మీ పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ఈ పొరపాట్లు చేస్తే ఖాతా ఇనాక్టివ్ అయిపోతుంది జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News