బాబ్లీ పోరాటం కేసులో ఏపీ సర్కార్ రీకాల్‌ పిటిషన్‌ !

బాబ్లీ ప్రాజెక్టు పోరాటం కేసులో చందరబాబుకు జారీ అయిన అరెస్ట్ వారెంట్ పై ధర్మాబాద్ కోర్టులో రీకాల్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఈ కేసు విచారణకు చంద్రబాబు వ్యక్తిగతంగా కాకుండా తన తరఫున లాయర్ పంపనున్నారు. 

Last Updated : Sep 20, 2018, 10:11 AM IST
బాబ్లీ పోరాటం కేసులో ఏపీ సర్కార్ రీకాల్‌ పిటిషన్‌ !

విజయవాడ: బాబ్లీ ప్రాజెక్టు పోరాటం కేసులో చందరబాబుకు జారీ అయిన అరెస్ట్ వారెంట్ పై ధర్మాబాద్ కోర్టులో రీకాల్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఈ కేసు విచారణకు చంద్రబాబు వ్యక్తిగతంగా కాకుండా తన తరఫున లాయర్ పంపనున్నారు. 

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేంగా టీడీపీ పోరుబాట పట్టిన విషయం తెలిసిందే.  మహా రాష్ట్ర ప్రభుత్వం నింబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు టీంతో పాటు వేలాది మంది రైతులు అక్కడ వెళ్లి ధర్నా చేపట్టారు. ఇది ఉద్రిక్తత దారి తీసింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. 

ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవరించారంటూ నాందేడ్ పోలీసులు చంద్రబాబుతో సహా మరో 16 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం చంద్రబాబు సహా కేసుతో ప్రమేయం ఉన్న టీడీపీ నేతలను ఈ నెల 21న తమముందు హాజరుపర్చాలని  ధర్మాబాద్‌ కోర్టు ఆదేశిస్తూ వారెంట్‌ జారీ చేసింది. ఈ విషయాన్ని నాందేడ్ ఎస్పీ మంగళవారం ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఏపీ సర్కార్ ..చంద్రబాబు బదులు ఆయన తరఫున న్యాయవాదిని పంపాలని నిర్ణయిం తీసుకుంది. అలాగే ఈ కేసులో జారీ అయిన అరెస్ట్ వారెంట్ పై రీకాల్ చేయాలని నిర్ణయించింది

Trending News