KTR Questions to Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీ అంటూ ఫైర్ అయ్యారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా..? అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో 2 లక్షల 2 వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60 వేల 83 నియామకాలను తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ లెక్క తప్పని నిరూపించగలవా..? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో (2004-14) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? కేవలం 10,116 మాత్రమే కాదా..? ఇదేనా నిరుద్యోగులైన మీ ప్రేమ..? అని నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి సగటున నింపిన సర్కారు కొలువులు 16,850 అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 1012 జాబులు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌కు.. బీఆర్ఎస్కు తేడా ఇదేన్నారు. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశావా..? ఉద్యోగం చేశావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? పోటీ పరీక్షలు రాశావా..? ఇంటర్వ్యూ కు వెళ్లినవా..? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు..? అంటూ రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
95 శాతం ఉద్యోగాలు స్థానిక బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన నిబద్ధత తమదన్నారు కేటీఆర్. ఆరు సూత్రాలు.. 610 జీవోలు.. గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చేసి.. నాన్ లోకల్ కోటాలు పెట్టి.. తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పనికిమాలిన పాలనలో ఉపాధిలేక.. ఉద్యోగాల్లేక నిరాశా నిస్పృహలతో తెలంగాణ యువత తుపాకులు చేతబట్టి అడవి బాటపట్టి నక్సలైట్లలో చేరింది నిజమా..? కాదా..? అని అడిగారు.
2004లో తెలంగాణకు ఇచ్చిన మాటతప్పి.. పదేండ్లు కాలయాపన చేసి వందల మంది యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన నేరం మీది కాదా..? అని నిలదీశారు. సోనియగాంధీ బలిదేవతని మీ పీసీసీ ప్రెసిడెంటే చెప్పింది అబద్ధమా..? అని అడిగారు. కర్ణాటకలో 100 రోజుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి..? అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ మరిచారని విమర్శించారు.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి