Healthy Foods Must Have Everyday: ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకోనే మార్పుల కారణంగా చాలా మంది ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా మార్కెట్లో లభించే ప్యాకేజింగ్ ఫూడ్స్ మీద మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎంచుకోవడంలో చాలా మంది పలు సమస్యలను ఎదురుకుంటున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి..? అనే ప్రశ్న తరచుగా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటీ..? ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చ..? అనే అంశం మీద ఇప్పుడు తెలుసుకుందాం
ఆరోగ్యకరమైన ఆహారం అంటే..?
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది వివిధ ప్రశ్నలతో కూడిన సమస్య అని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన అహారం తీసుకోవడం అంటే కష్టటంతో కూడినదని కొందరు భావిస్తుంటారు. దీని కారణంగా ఇష్టంగా తినే ఆహారాన్ని కోల్పోతామని అనుకుంటారు. కానీ, ఆరోగ్యకరమైన ఆహారం అంటే పోషక విలువలుతో కూడినది. దీనిని ప్రతిరోజు మన డైట్‌లో తీసుకోవడం కారణంగా మన శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సులువైన చిట్కాలు పాట్టించడం ద్వారా మీ గందరగోళాన్ని తగ్గించకోవచ్చు.
ప్రోటీన్ తో కూడిన ఆహార పదార్థాలు..
మీరు రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అధిక మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ తో కూడిన పదార్థాలు తినడం ద్వారా మానసిక స్థితి మెరుగు పడుతుంది. అవి ఎక్కువగా గుడ్లు, పాలతో తయారు చేసిన పదార్థాల్లో లాభిస్తుంది.
ఫైబర్ అధికంగా తీసుకోవాలి..
కొన్ని రకాల కూరగాయలు, పండ్లల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. పీచు పదార్థాలు తీసుకోవడం కారణంగా జీర్ణవ్యవస్థను మెరుగు పరచవచ్చు. ముఖ్యంగా బెండకాయ, బీరకాయ వంటివి తీసుకోవటం ద్వారా ఫైబర్ ను పొందవచ్చు.
కాల్షియం తో కూడిన ఆహారం..
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియంతో కూడిన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అందులోను విటమిన్ D,K కలిగిన ఆహారం పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. ఇవి అధికంగా గింజలు, తృణధాన్యాలు, నారింజలో లభిస్తుంది.
Also Read: Curry Leaves Water: రోజూ కరివేపాకు నీళ్లు ఇలా తాగితే, డయాబెటిస్, ఇమ్యూనిటీ, స్థూలకాయం అన్నింటికీ సమాధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి