Mangala Aditya Raja Yoga: రేపే అతి శక్తివంతమైన మంగళ ఆదిత్య రాజయోగం..ఈ రాశులవారికి గోల్డెన్‌ లక్కీ డేస్‌ స్టార్ట్..

Most Powerful Raja Yoga Astrology: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడిపోతోంది. ఈ ప్రత్యేక యోగం ఓకే రాశిలో సూర్యుడు కుజుడు కలవడం కారణంగా ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 05:57 PM IST
Mangala Aditya Raja Yoga: రేపే అతి శక్తివంతమైన మంగళ ఆదిత్య రాజయోగం..ఈ రాశులవారికి గోల్డెన్‌ లక్కీ డేస్‌ స్టార్ట్..

 

Mangala Aditya Raja Yoga Effect: డిసెంబర్ చివరి వారంలో కుజ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి రాశిలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో కుజ సంచారానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అయితే ఈ గ్రహం డిసెంబర్ 27వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతోంది. ఇంతకుముందు సూర్యగ్రహం కూడా ధనస్సురాశిలోకి సంచారం చేసింది. ధనస్సు రాశిలో సూర్య, గ్రహాలు కల్వబోతున్నాయి. దీనికి కారణంగా ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రత్యేక యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. విశ్వాసం సౌర్యం శక్తికి సూచికగా భావించే కుజుడు ధనస్సు రాశిలో సూర్యుడితో కలవడం కారణంగా కొన్ని రాశుల వారికి సంతోషంతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవ్వబోతోంది. ముఖ్యంగా ఆదిత్య మంగళ రాజయోగం కారణంగా ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారిపై ఆదిత్య మంగళ రాజయోగ ప్రభావం:
సింహరాశి:

ఆదిత్య మంగళ రాజయోగం కారణంగా సింహ రాశి వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మిత్రుల సహాయంతో అపారమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఇంతకు ముందున్న ఆర్థిక పరిస్థితుల కంటే చాలావరకు మెరుగుపడతాయి. అయితే ఖర్చు విషయంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

తుల రాశి:
తులా రాశి వారికి ధనస్సు రాశిలో సూర్యుడు కుజుడు కలవడం కారణంగా ఏర్పడే రాజయోగం కారణంగా మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో మాధుర్యం రెట్టింపు అవుతుంది. పోటీ పరీక్షలు రాసేవారు సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించింది..ఎలాంటి కష్టమైన పనులైన ఈజీగా చేయగలుగుతారు. దీంతోపాటు ఈ సమయంలో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వారికి పురోగతి అవకాశాలు కూడా ఉన్నాయి.

Also read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

ధనుస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ ఆదిత్య మంగళ రాజయోగం ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో ధనస్సు రాశి వారు పిల్లలనుంచి ఊహించని శుభవార్తలు వింటారు. ఇక ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు. దీంతోపాటు భాగస్వామితో ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. 

మీన రాశి:
ఒకే రాశిలో సూర్యగ్రహం కుజ గ్రహం కలవడం కారణంగా ఏర్పడే మంగళ ఆదిత్య రాజయోగ ప్రభావం మీన రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా పూర్తి విశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక  లాభాలు పొందడానికి కొత్త ఆదాయ వనరులు కూడా పుట్టుకొస్తాయి. అలాగే సంపాదన పెరగడం కారణంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం\​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News