Jajikaya: జాజికాయ పొడి తీసుకోవడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా..?

Jajikaya Benefits: సాధారణంగా వంట్లలో అనేక రకాల దినుసులను వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మసాలా దినుసులను బిర్యాని  తదితర వంట్లలో వాడుతూ ఉంటాము. అయితే  వంట్ల‌లో వాడే మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒక‌టి. నాన్ వెజ్ వంట‌కాల్లో, వివిధ ర‌కాల వంట్లల త‌యారీలో  ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. అవి ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 10:46 PM IST
Jajikaya: జాజికాయ పొడి తీసుకోవడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా..?

Jajikaya Benefits: జాజికాయను ఎక్కువగా పొడిగా చేసి ఆహార పదార్థాల్లో వాడుతూ ఉంటాము. ముఖ్యంగా నాన్‌ వెజ్‌లో ఈ జాజికాయను వేస్తు ఉంటాము. దీనిని ఉపయోగించడం వల్ల ఆహారం ఎంతో రుచిగా, సువాసనగా ఉంటుంది. అయితే దీనిని తినడం కారణంగా ఎంతో మేలు క‌లుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

జాజికాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.దీనీ తీసుకోవడం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చని వైద్యులు అంటున్నారు. జాజికాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్రయోజ‌నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

 ✢ జాజికాయ‌ను వాడ‌డం వ‌ల్ల అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

 ✢   జాజికాయ‌ను  తీసుకోవడం వ‌ల్ల  మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. 

 ✢ జాజికాయ పొడిని గోరు వెచ్చ‌ని పాల‌ల్లో వేసుకుని రాత్రి ప‌డుకునే ముందు తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌గా నిద్ర ప‌డుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 ✢  జాజికాయ‌లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా లభిస్తాయి.

Also read: Beauty Tips: అందం కోసం రోజు వాడే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత ప్రమాదకరమో తెలుసా..?

 ✢  కీళ్ల నొప్పులు, వాపుల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు జాజికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం కలుగుతుంది. 

 ✢ జాజికాయ‌ వల్ల  చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌లు అదుపులో ఉంటాయి. 

 రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో సహాయపడుతుంది. 

జాజికాయ‌ను వాడ‌డం వల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

 ఈ విధంగా జాజికాయ  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని  ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు.

Also read: Black Raisins: నల్ల ఎండు ద్రాక్ష తింటే..నెలసరి సమయంలో వచ్చే నొప్పి మాయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook                                                            

Trending News