Nobel Laureate Jailed: కార్మిక చట్టాల్ని ఉల్లంఘించిన కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి బహమతి గ్రహీత ప్రముఖ ఆర్ధిక వేత్త మొహమ్మద్ యూనుస్‌కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటనపై రాజకీయాలు అలముకున్నాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన 83 ఏళ్ల ఆర్ధికవేత్త మొహమ్మద్ యూనుస్ పేదరిక వ్యతిరేక ప్రచారం, కార్యక్రమాలకు 2006లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్నారు. 1983లో ఇతను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ప్రపంచంలోనే హోమ్ ఆఫ్ మైక్రో క్రెడిట్‌గా ఖ్యాతినార్జించింది. గ్రామీణ టెలీకం పేరుతో ఇతడు స్థాపించిన ఓ కంపెనీలో యూనుస్, అతని ముగ్గురు సహచరులపై కార్మిక సంక్షేమ నిది సమకూర్చలేదనే ఆరోపణలున్నాయి. కార్మిక చట్టాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో మొహమ్మద్ యూనుస్ సహా అతని ముగ్గురు సహచరులకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విదించింది. దాంతోపాటు 25 వేల బంగ్లా టాకాలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో పది రోజులు అదనంగా జైలులో గడపాల్సి వస్తుంది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ కార్మిక చట్టం, నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు ప్రభుత్వంతో వివిద అంశాల్లో వ్యతిరేకిస్తున్నారు. 2008లో అధికారంలో వచ్చిన షేర్ హసీనా ప్రభుత్వం ఈయన కేసులపై దర్యాప్రు ప్రారంభించింది. 2011లో గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించింది. అంతేకాకుండా వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ యూనుస్‌ను తొలగించింది.
మరి కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు మొహమ్మద్ యూనుస్‌కు జైలు శిక్ష విధించడంతో రాజకీయ ప్రేరేపితమనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే 2007లో బంగ్లాదేశ్‌లో మిలట్రీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన మొహమ్మద్ యూనుస్‌పై షేక్ హసీనా ఆగ్రహించారు. అప్పట్నించి ప్రభుత్వానికి ఈయనకు మధ్య విబేధాలు వస్తూనే ఉన్నాయి.
Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook