YCP Second List: రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మార్పులు చేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ భారీగా అభ్యర్ధుల్ని మార్చేస్తోంది. ఇటీవల 11 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంచలనం రేపిన వైఎస్ జగన్ ఇప్పుడు 27 మందితో రెండో జాబితా విడుదల చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి, అనంతపురం జిల్లా అభ్యర్ధులున్నారు. మొత్తం 27 మంది నియోజకవర్గ ఇన్ఛార్జిలతో రెండో జాబితా విడుదలైంది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గ స్థాయిలో నేతలు, కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో విస్తృత స్థాయిలో చర్చల అనంతరం వైఎస్ జగన్ స్వయంగా రెండో జాబితాను సిద్ధం చేశారు. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని, అందుకోసం ఎక్కడైనా ఎవరైనా బలహీనంగా ఉంటే ఆ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు అవసరమౌతాయని వైఎస్ జగన్ గతంలోనే సూచించారు. జరిగే మార్పులకు సహకరించాలని, రానున్న రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని పార్టీ శ్రేణులకు చెప్పారు.
ఓ వైపు నియోజకవర్గ స్థాయిలో అభ్యర్ధుల బలాబలాలు, సామాజిక సమీకరణాలు లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది స్థాన చలనమైంది. కొందరు ఎంపీలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.
1. అనంతపురం పార్లమెంట్ ఎం శంకర నారాయణ
2. హిందూపురం పార్లమెంట్ జోలదరాశి శాంత
3. అరకు పార్లమెంట్ కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
4. రాజాం డాక్టర్ తాలె రాజేష్
5. అనకాపల్లి మలసాల భరత్ కుమార్
6. పాయకరావు పేట ( ఎస్సీ) కంబాల జోగులు
7. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాశ్
8. పి గన్నవరం (ఎస్సీ) విప్పర్తి వేణుగోపాల్
9. పిఠాపురం వంగా గీత
10. జగ్గంపేట తోట నర్శింహం
11. ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు
12. రాజమండ్రి సిటీ మార్గాని భరత్
13. రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
14. పోలవరం ( ఎస్టీ) తెల్లం రాజ్యలక్ష్మి
15. కదిరి బీఎస్ మక్బూల్ అహ్మద్
16. ఎర్రగొండపాలెం ( ఎస్సీ) తాటిపర్తి చంద్రశేఖర్
17. ఎమ్మిగనూర్ మాచాని వెంకటేశ్
18. తిరుపతి భూమన అబినయరెడ్డి
19. గుంటూరు తూర్పు షేక్ నూరి ఫాతిమ
20. మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి
21. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
22. పెనుకొండ కేవి ఉషా శ్రీచరణ్
23. కళ్యాణదుర్గం తలారి రంగయ్య
24. అరకు ( ఎస్టీ) గొడ్డేటి మాధవి
25. పాడేరు ( ఎస్టీ) విశ్వేశ్వర రాజు
26. విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు
27. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్
Also read: Ysrcp Strategy: కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ, వంగవీటి, ముద్రగడ కోసం ప్రయత్నాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook