Hair Care Tips: చలికాలంలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో కీలకమైంది కేశ సమస్య. హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, కేశాలు నిర్జీవంగా మారడం, డేండ్రఫ్ ఇలా రకరకాల సమస్యలు మీ కేశాల్ని పాడుచేస్తాయి. అది కాస్తా మీ అందంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సులభమైన మార్గం లేకపోలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
హెయిర్ స్టైలింగ్, వాతావరణం కారణంగా చలికాలంలో కేశాలు దెబ్బతినకుండా ఉండేందుకు అత్యుత్తమ మార్గం తలస్నానం చేయడానికి ముందు క్రమం తప్పకుండా నూనె రాస్తే మంచి ఫలితాలుంటాయంటున్నారు. తలకు నూనె అనేది ఎన్నాళ్ల నుంచో అమల్లో ఉన్న అత్తుత్తమ మార్గం. దీనివల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవకాడో, అల్లోవెరా, జైతూన్ ఆయిల్ వంటి సహజసిద్ధ పోషకాలు కలిగిన నూనె కేశాలకు చాలా మంచిది. వీటివల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. జుట్టు నిర్జీవంగా మారడం తగ్గుతుంది.
తల స్నానం చేయడానికి కొన్ని గంటల ముందు తలకు నూనె రాయడం చాలా మంచి పద్దతి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కేశాలకు కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. సాధారణంగా నూనె రాస్తే డేండ్రఫ్ సమస్య పెరుగుతుందంటారు. అందుకే దుమ్ము, ధూళి, ఆయిల్ నిండిన తలకు రాసే బదులు శుభ్రంగా ఉన్న తలకు నూనె రాయాలి. దీనివల్ల తల ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడో, అల్లోవెరా, జైతూన్ ఆయిల్ ఈ మూడింటి మిశ్రమం వల్ల చలికాలంలో సైతం మీ కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. డ్రైనెస్, కాలుష్యం, డేండ్రఫ్ వంటి అనేక సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. అందుకే ఇటువంటి హెయిర్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. కేశాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి. దాంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల కేశాల మూలాలు పటిష్టంగా మారతాయి. జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలు నిర్మూలించబడతాయి. జుట్టును వివిధ రకాల సమస్యల్నించి కాపాడేందుకు రెండు అంశాలు కీలకం. ఒకటి డీప్ ఆయిల్ మసాజ్. రెండోది మైల్డ్ షాంపూ. అవకాడో అనేది కేశాల్ని పటిష్టపరుస్తుంది. అల్లోవెరా డీప్ కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. డ్రైనెస్ పోగొడుతుంది. జైతూన్ ఆయిల్ అనేది విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే ఆయిల్ కావడం వల్ల కేశాలకు కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
Also read: H1-B Visa: భారతీయులకు గుడ్‌న్యూస్, జనవరి నుంచి హెచ్ 1బి వీసా రెన్యువల్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook